సాంగ్ రిలీజ్ చేసి తప్పుచేశారా..?

2.0 తెలుగు వెర్షన్ కు సంబంధించి 2 రోజుల కిందట ఓ తమాషా జరిగింది. ప్రెస్ మీట్ ఉంది రమ్మని ప్రెస్ అందరికీ కబురుపెట్టారు. ఎక్స్ క్లూజివ్ గా ఓ సాంగ్ అందరికీ చూపిస్తామని,…

2.0 తెలుగు వెర్షన్ కు సంబంధించి 2 రోజుల కిందట ఓ తమాషా జరిగింది. ప్రెస్ మీట్ ఉంది రమ్మని ప్రెస్ అందరికీ కబురుపెట్టారు. ఎక్స్ క్లూజివ్ గా ఓ సాంగ్ అందరికీ చూపిస్తామని, ఆ తర్వాత దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్ కీలక సభ్యులు మాట్లాడతారని చెప్పారు. అలా 2.0 తెలుగు వెర్షన్ కు అఫీషియల్ గా ప్రచారం స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

శంకర్ అనగానే మీడియా క్యూ కట్టింది. అంతా వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లేసరికి చెన్నై నుంచి ఎవరూ రాలేదు. మొదట్నుంచి తెలుగు వెర్షన్ ను లైట్ తీసుకున్న యూనిట్, ఎప్పట్లానే డుమ్మా కొట్టేసింది. తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాత్రం ఉన్నారు. ఇక చేసేదేం లేక పాత్రికేయులకు 2.0లో పాటను ఎక్స్ క్లూజివ్ గా ప్రదర్శించి పంపించేశారు. ఎన్వీ ప్రసాద్ కెమెరా ముందుకు కూడా రాలేదు.

అలా టాలీవుడ్ లో ఏర్పాటుచేసిన 2.0 తెలుగు వెర్షన్ తొలి ప్రచార కార్యక్రమం ఫ్లాప్ అయింది. ఈ సంగతి పక్కనపెడితే.. మీడియాకు చూపించిన పాట మరీ పేలవంగా ఉంది. రజనీకాంత్ ఎప్పీయరెన్స్, మర బొమ్మలా కనిపించిన ఎమీ జాక్సన్, భారీ సెట్, మధ్యమధ్యలో గ్రాఫిక్స్ మినహా పాటలో ఇంకేం కనిపించలేదు.

ఇంత బడ్జెట్ పెట్టి, ఇన్ని గ్రాఫిక్స్ ఉపయోగించి పాటలో అలాంటి స్టెప్స్ వేయించారేంటని మీడియా వాళ్లు గుసగుసలాడుకున్నారు. విడుదలకు ముందు ఇలాంటి పాట చూపించి యూనిట్ తప్పుచేసింది. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదలకాబోతోంది 2.0. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 600 కోట్ల రూపాయలు.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్