జాతీయ నాయకుడు కాదు.. ముమ్మాటికీ జాతి నాయకుడే

భారతదేశ రాజకీయాల్లో పచ్చి అవకాశవాది ఎవరంటే కచ్చితంగా చంద్రబాబు పేరే నెంబర్-1 స్థానంలో ఉంటుంది. అధికారంలోకి రావడానికి, రాజకీయ అవసరాలకో ఎలాంటి గడ్డి కరవడానికైనా వెనకాడని బాబు ఆ అవసరం తీరాక తన నిజస్వరూపాన్ని…

భారతదేశ రాజకీయాల్లో పచ్చి అవకాశవాది ఎవరంటే కచ్చితంగా చంద్రబాబు పేరే నెంబర్-1 స్థానంలో ఉంటుంది. అధికారంలోకి రావడానికి, రాజకీయ అవసరాలకో ఎలాంటి గడ్డి కరవడానికైనా వెనకాడని బాబు ఆ అవసరం తీరాక తన నిజస్వరూపాన్ని నిస్సిగ్గుగా బయటపెడుతుంటారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ నాయకుడినని చెప్పుకునే బాబు, మరోసారి తన నైజాన్ని బయటపెట్టి తాను ముమ్మాటికీ 'జాతి' నాయకుడినేనని నిరూపించుకున్నారు.

మమతని మరచిపోయావా బాబూ..? 2019 లోక్ సభ ఎన్నికల్లో చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులు అన్నీ ఇన్నీ కావు. అప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోయిందనే భ్రమలో ఉన్న బాబు.. మూడో కూటమి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, దేవెగౌడ.. ఇలా అందర్నీ కలుపుకొన్నారు. ఏపీలో వారితో ప్రచారం చేయించుకున్నారు. వారి తరపున ఆయా రాష్ట్రాల్లో ప్రచార సభలకు కూడా వెళ్లారు. 

అందరి సంగతి వదిలేద్దాం.. పాపం ఇప్పుడు మమతా బెనర్జీ కాలికి గాయంతో ఆస్పత్రిలో ఉన్నారు. ఐసీయూలో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ దాడి చేయించిందని టీఎంసీ కార్యకర్తలు హంగామా సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మన జాతీయ నాయకుడికి చీమకుట్టినట్టయినా లేదు. కనీసం దీదీని పలకరించిన పాపాన పోలేదు. ఆమె ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఓ ట్వీట్ కూడా వేయలేదు. అసలు మమతా ఎవరో తెలియనట్టు, జాతీయ రాజకీయాలతో తనకు సంబంధం లేనట్టున్నారు బాబు.

మోదీ అంటే అంత భయమా..? 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు చంద్రబాబు. ఆయన భార్యను సైతం పాలిటిక్స్ లోకి లాగి మరీ విమర్శించారు. ఆ తర్వాత బాబు దారుణ పరాభవం, మోదీ ఘన విజయం.. తెలిసిందే. అంతే మరుసటి రోజే బాబు సరెండర్ అయిపోయారు. మోదీపై నో కామెంట్, ఎక్కడ ఏం జరిగినా అన్నిటికీ జగనే కారణం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేది కేంద్ర ప్రభుత్వం అయినా కూడా మోదీపై నో కామెంట్. ఢిల్లీలో రైతుల నిరసనపై కూడా నో కామెంట్, బెంగాల్ సీఎం మమతపై దాడి జరిగితే నో కామెంట్.

ఇంత స్పందన లేని, చేవ చచ్చిన రాజకీయాలు చంద్రబాబుకి అవసరమా. ఆమాత్రం ధైర్యం లేని బాబుకి జాతీయ అధ్యక్షుడు అనే పదవి అవసరమా..?

దమ్ము ధైర్యం ఎవరికి అవసరం..? మీకు సిగ్గులేదు, చేవ చచ్చిపోయింది, దమ్ము, ధైర్యం ఉంటే వైసీపికి వ్యతిరేకంగా ఓటు వేయండి, అమరావతిని గెలిపించండి అంటూ.. విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని రెచ్చగొట్టారు చంద్రబాబు.

ఇప్పుడా దమ్ము, ధైర్యం లోపించాయి కాబట్టే మమత విషయంలో మౌనంగా ఉన్నారు. ఉక్కు విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడే కాదు, ఎప్పుడూ జాతీయ నాయకుడు కాలేరు. కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే ఆయన నాయకుడు. 

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జాతి రత్నాలు మూవీ పబ్లిక్ టాక్