పెళ్లి తర్వాత ప్రేమ.. కానీ అమ్మాయి వేరే!

ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఓ పద్ధతి. పెళ్లయిన తర్వాత భార్యను ప్రేమించడం మరో పద్ధతి. కానీ ఈ రెండింటినీ మరో విధంగా మిక్స్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత…

ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఓ పద్ధతి. పెళ్లయిన తర్వాత భార్యను ప్రేమించడం మరో పద్ధతి. కానీ ఈ రెండింటినీ మరో విధంగా మిక్స్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మరో అమ్మాయిని ప్రేమించాడు. ఫలితంగా ఆ అమ్మాయి ఆత్మహత్యకు కారణమయ్యాడు. ఖమ్మం జిల్లాలో జరిగింది ఈ ఘటన.

డిగ్రీ చదివిన రత్నకుమారి ఖమ్మంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ సంజయ్ తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు స్నేహంగా ఉన్నారు. తర్వాత వాళ్ల స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఎక్కడా తనకు ఆల్రెడీ పెళ్లయిందనే విషయాన్ని సంజయ్, రత్నకుమారికి చెప్పలేదు.

ప్రేమలో మునిగితేలిన వీళ్లు చాలా దూరం వెళ్లారు. అంతలోనే విషయం సంజయ్ బామ్మర్ది ప్రకాష్ కు తెలిసింది. అతడు వచ్చి రత్నకుమారిని మందలించాడు. సంజయ్ కు ఆల్రెడీ పెళ్లయిందనే విషయాన్ని అలా తెలుసుకున్న రత్నకుమారి తీవ్రంగా చలించిపోయింది.

వెంటనే తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. నిన్నరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఖమ్మం తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. రత్నకుమారి బాబాయ్ ఫిర్యాదుతో సంజయ్, అతడి బామ్మర్దిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జాతి రత్నాలు మూవీ పబ్లిక్ టాక్