అసలు సమస్య కొరటాల శివ?

మహేష్-పరుశురామ్ సినిమా వ్యవహారం ఎంత వరకు వచ్చింది. అసలు ఆ సినిమా డీల్ సెట్ కావడానికి సమస్య ఏమిటి? 14రీల్స్ సంస్ధకు పరుశురామ్ కమిట్ అయి వుండడం ఒక్కటే సమస్య?  అసలు 14రీల్స్ తో…

మహేష్-పరుశురామ్ సినిమా వ్యవహారం ఎంత వరకు వచ్చింది. అసలు ఆ సినిమా డీల్ సెట్ కావడానికి సమస్య ఏమిటి? 14రీల్స్ సంస్ధకు పరుశురామ్ కమిట్ అయి వుండడం ఒక్కటే సమస్య?  అసలు 14రీల్స్ తో కలిసి సినిమా చేయడానికి మైత్రీ ఎందుకు ముందుకు రావడం లేదు?

ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఓ ట్విస్ట్ వుంది. ఓ సమాధానం వుంది. ఆ సమాధానం పేరు కొరటాల శివ.

విషయం ఏమిటంటే, పరుశురామ్ ను మహేష్ దగ్గరకు తీసుకెళ్లడంతో దర్శకుడు కొరటాల శివది కీలకపాత్ర. అయితే అప్పుడే ఆయన మైత్రీతో ఒక ఓరల్ ఒప్పందం పెట్టుకున్నారు. మహేష్ కనుక పరుశురామ్ తో సినిమా చేస్తే, తనకు సగభాగం వాటా ఇవ్వాలని. దానికి మైత్రీ కూడా ఓకె అన్నట్లు బోగట్టా.

ఇప్పుడు ఏమయింది? పరుశురామ్ ను పిలిచి చాన్స్ ఇస్తుంటే 14రీల్స్ సంస్థతో కమిట్ మెంట్ వుందటున్నారు. దానికి ఓకె అంటే మొత్తం సినిమా మూడు వాటాలుగా మారుతుంది. దానివల్ల లాభాలు తగ్గిపోతాయి. అది ఇష్టం లేదు మైత్రీ సంస్థకు. అందుకే ఎలాగైనా 14రీల్స్ సంస్థను పక్కకు తప్పించాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. అదే కనుక సీన్ లో కొరటాల శివ లేకుండా వుండే 14 రీల్స్ కు భాగస్వామ్యం ఇవ్వడానికి సమస్య వుండేది కాదు. 

నమ్రతతో భేటీ

నిన్ననో మొన్ననో విషయం తేల్చుకోవడానికి పరుశురామ్ నేరుగా  మహేష్ తో ఇంట్రాక్ట్ కావాలనుకున్నారు. కానీ చిత్రంగా ఆ మీటింగ్ లో మైత్రీ జనాలు, నమ్రత కూడా జాయిన్ అయినట్లు బోగట్టా. వారు నిర్మాణం, భాగస్వామ్యం ఇదంతా మాట్లాడకుండా, ప్రాజెక్టు, టెక్నీషియన్ల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో కాస్త భంగపడిన పరుశురామ్ మాట్లాడకుండా వచ్చేసినట్లు తెలుస్తోంది

దీంతో ఇక విసిగిపోయిన మైత్రీ నవీన్, ఏదో ఒకటి తేల్చుకుని 14 రీల్స్ తో మాట్లాడుకుని వస్తే రండి, లేకుంటే లేదు అనే విధంగా చెప్పేసి అమెరికా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అంటే మహేష్ తో సినిమా చేయాలనుకుంటే తాము చెప్పినట్లు 14 రీల్స్ వదిలిరావాలని ఇండైరెక్ట్ గా హుకుం జారీ చేసినట్లు అనుకోవాలి. 

ఇప్పుడు ఇక బాల్ పరుశురామ్ కోర్టులో వుంది. ఆయన 14రీల్స్ ను వదులుకుని, మైత్రీ-కొరటాల శివ కు మహేష్ తో సినిమా చేయాల్సి వుంటుంది. లేదా 14 రీల్స్ కోసం మహేష్ సినిమాను వదులుకోవాల్సి వుంటుంది. ఏం జరుగుతుందో, వెయిట్ అండ్ సీ.

‘మెగాస్టార్ ది లెజెండ్’ పుస్తకావిష్కరణ