పృథ్వీని ఇంకా వదలని బాధ…!

కొంతమంది ఆస్తులు  పోయినా బాధపడరేమోగాని పదవులు  పోతే మాత్రం యమ బాధపడిపోతుంటారు. టర్మ్‌ ముగిసిపోయి పదవి పోతేనే బోరుమంటారు. ఇక అవినీతి ఆరోపణతోనో, ఇంకా ఏవైనా అభియోగాతోనో బలవంతంగా పదవి నుంచి దిగిపోవల్సివస్తే ఇక…

కొంతమంది ఆస్తులు  పోయినా బాధపడరేమోగాని పదవులు  పోతే మాత్రం యమ బాధపడిపోతుంటారు. టర్మ్‌ ముగిసిపోయి పదవి పోతేనే బోరుమంటారు. ఇక అవినీతి ఆరోపణతోనో, ఇంకా ఏవైనా అభియోగాతోనో బలవంతంగా పదవి నుంచి దిగిపోవల్సివస్తే ఇక ఆ బాధ చెప్పనలవి కాదు. పైకి గంభీరంగా మాట్లాడుతూనే ఉంటారు. ఆ పదవి పోయినా ప్రాబ్లెం లేదంటారు.

ఆ పదవి తనకో లెక్క కాదంటారు. కాని ఎవరైనా పలకరిస్తే  చాలు  అంటే మీడియా వాళ్లు ఇంటర్వ్యూ చేశారనుకోండి మనసులో ఉన్నదంతా వెళ్లగక్కుతారు. టీటీడీకి చెందిన భక్తి ఛానెల్‌ ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి నుంచి అవమానకరమైన పరిస్థితిలో దిగిపోయిన థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ నటుడు పృథ్వీ పరిస్థితి ఇలాగే ఉంది.

ఈయన వైఎస్సార్‌సీపీలో చేరి, వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో పాల్గొని, టీడీపీ మీద విమర్శలు  చేసినందుకు చక్కటి ప్రతిఫలమే దక్కింది. కాని ఏం లాభం? నిబెట్టుకోలేకపోయాడు. పృథ్వీ పదవిలో ఉండగా ఎంత దూకుడుగా వ్యవహరించాడో, ఎంతగా అడ్డూఅదుపు లేకుండా మాట్లాడాడో, ఎంతగా రెచ్చిపోయాడో చూశాం. తాను గొప్ప భక్తుడినని, వెంకటేశ్వర స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని పదే పదే చెప్పుకున్నాడు.

కాని ఎస్వీబీసీ గురించి, దాని కార్యక్రమాల  గురించి, దాని అభివృద్ధి గురించి ఏనాడూ మాట్లాడిన దాఖలాు లేవు. రాజకీయాలకు అతీతమైన పదవిలో ఉండి, పాలిటిక్స్‌ మాట్లాడకూడని పదవిలో ఉండి, రెచ్చగొట్టే మాటలు, పరుషంగా మాట్లాడకూడని పదవిలో ఉండి కూడా వీధి రౌడీలా చెరేగిపోయాడు. 

చివరకు ఓ మహిళతో ఫోన్‌ సంభాషణ కారణంగా పదవి పోగొట్టుకొని ఇంటికెళ్లాడు. పదవిలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన పృథ్వీ అది కోల్పోయాక పూర్తిగా పత్తిత్తు అయిపోయాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొంతనలేని మాటలతో తన బాధను ఏకరువు పెట్టుకున్నాడు.

పదవిలో ఉన్నప్పుడు ఘాటుగా మాట్లాడే చాలామంది నాయకులు  పదవి పోయాక మతి స్థిమితం లేనట్లుగా మాట్లాడుతుంటారు. పదవిలో అంత మహత్యం ఉంటుంది మరి. ముప్పయ్యేళ్ల నుంచి తాను సినిమా రంగంలో ఉన్నా ఏనాడూ వివాదాల  జోలికి పోలేదన్నాడు. ఉండొచ్చు. సినిమా రంగంలో వివాదాలు   సృష్టిస్తే తొక్కిపడేస్తారు. వేషాలు  కరువైపోతాయి. నటన అనేది పదవి కాదు కాబట్టి అణిగిమణిగి ఉన్నాడేమో. 

కాని ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి శాశ్వతమనుకున్నాడు. చేతిలో పదవి ఉంటే అధికారం ఉంటుంది. ఏదోవిధంగా సంపాదించుకోవచ్చు. తనకు పదవిపై ఆశ లేదన్న పృథ్వీ మళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నాడు. ‘మళ్లీ పిలిస్తే శ్రీవారి సేవ కోసం వెళతా’ అని చెప్పాడు ఈ ఇంటర్వ్యూలో. ఒక పక్క ఆశ లేదంటాడు. అవకాశమిస్తే వెళతానంటాడు.

ఏమిటీ పొంతన లేని మాటలు ? ‘నేను కుర్చీలో (పదవిలో) కూర్చోగానే ఐదు రోజుల్లో వెళ్లిపోతానని అర్థమైంది. కాని ఐదు నెలు బతికున్నా (పదవిలో ఉన్నాడని అర్థం)’ అని చెప్పాడు. తన మీద తనే జ్యోతిష్యం చెప్పుకున్నాడన్నమాట. అట్లా ఎందుకు అనిపించిందో ఈయనకు? 

ఇందుకు కారణం ఆయనే చెప్పాడు. కొండ కింద విషసర్పాలు ఉన్నాయట.  వాటి మధ్యలో ఐదు నెలలు  బతికాడట…! మరి విష సర్పాలున్న చోటికి మళ్లీ ఎందుకు వెళ్లానుకుంటున్నాడు? పృథ్వీ కంటే ముందు టీడీపీ హయాంలో ఎస్వీబీసీకి దర్శకుడు రాఘవేంద్రరావు ఛైర్మన్‌గా ఉన్నారు.

ఆయనపై పృథ్వీ ఆరోపణలు  చేశాడు. కాని రాఘవేంద్రరావుపై తాను ఆరోపణు చేయలేదని చెప్పాడు. తాను చాలా మంచివాడినని తనకు తానే కితాబిచ్చుకున్న పృథ్వీ పదవి పోయాక కూడా నిజాయితీగా మాట్లాడలేకపోతున్నాడు. బాధ్యతాయుతమైన పదవిలో, అందులోనూ దేవుడికి సేవ చేసుకునే పదవిలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించకూడదో పృథ్వీని చూస్తే అర్థమవుతుంది.

‘మెగాస్టార్ ది లెజెండ్’ పుస్తకావిష్కరణ