‘ఆచార్య’ అటవీ సంరక్షణ

మానవ సంబంధాలు,  పర్యావరణం,  పల్లెల దత్తత,  గ్రామాల స్వయం పరిపాలన ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో సినిమాకు ఒక్కో సామాజిక అంశాన్ని హైలైట్ చేస్తూ వస్తున్న కొరటాల శివ ఈసారి అటవీ భూములు, ఆలయ…

మానవ సంబంధాలు,  పర్యావరణం,  పల్లెల దత్తత,  గ్రామాల స్వయం పరిపాలన ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో సినిమాకు ఒక్కో సామాజిక అంశాన్ని హైలైట్ చేస్తూ వస్తున్న కొరటాల శివ ఈసారి అటవీ భూములు, ఆలయ భూముల పరిరక్షణ అంశాన్ని టేకప్ చేస్తున్నారట. మెగాస్టార్ హీరోగా, రామ్ చరణ్ లేదా మహేష్ ను మరో పాత్రకు తీసుకుని చేస్తున్న ఆచార్య సినిమాలో అటవీ భూముల పరిరక్షణ మీద ఓ మాజీ నక్సల్ పోరాటాన్ని ప్రొజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

రామచరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మళ్లీ మరోసారి పాలకుల అసంబద్ధ విధానాలు, అవినీతి వ్యవహారాలను కొరటాల నిలదీయబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ మాజీ నక్సల్ పాత్రలో కనిపిస్తున్నారని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. సాధారణంగా నక్సలైట్లు అటవీ భూముల పరిరక్షణ, అటవీ భూముల్లో మైనింగ్ కూడదు, ఇలాంటి అంశాలను కీలకంగా తీసుకుంటారు. ఇప్పుడు కొరటాల కూడా అదే విషయం సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి సామాజిక సిరీస్ అనే ట్యాగ్ లైన్ లేకుండానే కొరటాల శివ వరుసగా మంచి అంశాలను టేకప్ చేస్తూ వస్తున్నారు. ఈ లెక్కన తరువాత చేయబోయే ఎన్టీఆర్, మహేష్ సినిమాలకు ఏం రెడీ చేసి వుంటారో మరి?

‘మెగాస్టార్ ది లెజెండ్’ పుస్తకావిష్కరణ