ఏబీఎన్ లో కరోనా కలకలం

గతేడాది దేశవ్యాప్తంగా మీడియా సంస్థల్ని అతలాకుతలం చేసింది కరోనా. దాదాపు ప్రతి మీడియా సంస్థలో ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. అంతా సద్దుమణిగిందనుకున్న టైమ్ లో మరోసారి మీడియాపై కరోనా ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్…

గతేడాది దేశవ్యాప్తంగా మీడియా సంస్థల్ని అతలాకుతలం చేసింది కరోనా. దాదాపు ప్రతి మీడియా సంస్థలో ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. అంతా సద్దుమణిగిందనుకున్న టైమ్ లో మరోసారి మీడియాపై కరోనా ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆఫీస్ లో కరోనా కోరలు చాచింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 20 మందికి పైగా కరోనా బారిన పడ్డారు.

లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా సడలించిన తర్వాత ప్రజలంతా కరోనాను లైట్ తీసుకున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. హైదరాబాద్ లో కనీస జాగ్రత్తలు కరువయ్యాయి. ప్రజలంతా మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా సమూహాల్లో కలిసిపోతున్నారు. ఏబీఎన్ ఉద్యోగులు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

గతేడాది కరోనా దెబ్బకు ఏబీఎన్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. ఉన్నఫలంగా వందలాది ఉద్యోగాలకు కోత వేసింది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం. కరోనా బూచిని చూపించి, కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా ఇళ్లకు పంపించింది. అలా అరకొర స్టాఫ్ తో నడుస్తున్న ఈ సంస్థను ఇప్పుడు మరోసారి కరోనా పట్టి పీడిస్తోంది.

కరోనా సోకిన వాళ్లంతా హోం ఐసొలేషన్ లో ఉన్నారు. వాళ్లతో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లు కూడా ముందుజాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం అతి తక్కువ సిబ్బందితో ఆ ఛానెల్ నడుస్తోంది.

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జాతి రత్నాలు మూవీ పబ్లిక్ టాక్