విశ్వనటుడు కమల్‌హాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా 'పాపులర్' అయ్యింది.. అదీ 'ప్రైవేట్ పిక్స్' లీక్ కావడంతో. అక్షర పలు సినిమాల్లో నటించినా, హీరోయిన్గా ఆమెకు రాని గుర్తింపు.. ఇప్పుడీ ప్రైవేట్ పిక్స్ లీక్ కావడంతో రావడం ఆశ్చర్యకరమే. ఇంతకీ, ఆ ప్రైవేట్ పిక్స్ ఎలా లీక్ అయ్యాయి.? ఇదే సస్పెన్స్.
అక్షర హాసన్, 2013 నుంచీ తనూజ్ అనే వ్యక్తితో ప్రేమలో మునిగి తేలింది. మూడేళ్ళ ప్రేమ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారట. విడిపోయి చాన్నాళ్ళే అయినా, ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ ప్రేమ వ్యవహారం తాలూకు సంగతులు బయటకొచ్చాయి.
అక్షర హాసన్ ప్రైవేట్ పిక్స్ లీక్ అవడంతో. అక్షర హాసన్ ఫోన్లోని ఫొటోలు బయటకు రావడం వెనుక 'సైబర్ క్రైమ్' వుందని అంతా అనుకున్నారు. అక్షరహాసన్ ఫిర్యాదు మేరకు, విచారణ కూడా మొదైలంది. ఈ కేసులో అక్షర హాసన్ మాజీ బాయ్‌ఫ్రెండ్ తనూజ్‌ని పోలీసులు విచారించారు.
తనూజ్ ఫోన్ ద్వారానే ఈ ఫొటోలు బయటకు వచ్చాయని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఆ ఫొటోలు అక్షర హాసన్ తనకు పంపినమాట వాస్తవమేననీ, అయితే ఆ ఫోన్ తాను ప్రస్తుతం వినియోగించడంలేదనీ, ఆ ఫోన్ లోంచి ఫొటోలు ఎలా బయటకు వెళ్ళాయో తనకు తెలియదని తనూజ్ అంటున్నాడు.
అక్షర – తనూజ్ 'ప్రేమ' పరంగా విడిపోయినా, ఇద్దరి మధ్యా స్నేహం కొనసాగుతోందనీ, ఈ విషయం వెలుగు చూశాక కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారని తనూజ్ సన్నిహితులు చెబుతుండడం గమనార్హం. అసలు ఫొటోలు ఎలా బయటకు వచ్చాయి.? అన్న విషయం విచారణలో తేలుతుంది.
కానీ, అక్షర హాసన్ 'ప్రేమ మైకం'లో తన ప్రైవేట్ ఫొటోస్‌ని ప్రియుడికి పంపడమేంటి.? వాటిని ఆ ప్రియుడు, ఫోన్లోనే వుంచడమేంటి.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రేమ మైకం కాదు, ప్రేమ పైత్యం.. అన్నది చాలామంది అభిప్రాయం.
అక్షర, తనూజ్లను సమర్థిస్తున్నవారు మాత్రం, 'ప్రేమలో ఇలాంటివన్నీ కామన్' అంటున్నారు. నిజమే మరి, ప్రైవేట్ పిక్స్‌లో కాస్తంత హాట్‌గా వున్నమాట వాస్తవమే.. కానీ, అంతకు మించి.. పోర్న్ తరహా వీడియో క్లిప్స్ కూడా 'స్మార్ట్'గా షేర్ అయిపోతున్న రోజులివి.
సో, అక్షర ప్రైవేట్ పిక్స్ లీక్ని చిన్న వ్యవహారంగా లైట్ తీసుకోవచ్చేమో. కానీ, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది కదా.! నిజాలు నిగ్గుతేలాల్సి వుంది.
బిడ్డా రాస్కో.. తెలంగాణలో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్