ఈ హెడ్డింగ్ చూడగానే, బుర్ర వుందా లేదా? అన్న కామెంట్ పెట్టేయాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది. ఎందుకంటే నాగార్జున ఎప్పటి నుంచో సినిమాల నిర్మాణంలో వున్నాడు. టీవీ సీరియళ్లు కూడా నిర్మిస్తున్నాడు. అందువల్ల కొత్తగా సినిమాలు నిర్మించడం ఏమిటి? కొంపదీసి భవన నిర్మాణ రంగంలోకి ఏమన్నా అడుగు పెడుతున్నాడా? అన్న డౌట్ కూడా వస్తుంది.
కానీ విషయం అదికాదు. కొత్తగా, కొత్తవాళ్లతో, కొత్త తరహా సినిమాలు నిర్మించడానికి ఓ ప్రత్యేకమైన బ్యానర్ స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నాడట నాగార్జున. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజెస్ బ్యానర్లు వున్నాయి. ఈ రెండూ కాకుండా, కేవలం చిన్న సినిమాలు, కొత్త టాలెంట్ ను పట్టుకుని, సినిమాలు నిర్మించడం కోసమే ఈ బ్యానర్ అంట.
గతంలో కూడా నాగ్ చిన్న, కొత్త సినిమాలను సమర్పించాడు. వాటిలో కొన్ని హిట్ లు వున్నాయి. కొన్ని ఫట్ లు వున్నాయి. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా, ఓ కొత్త బ్యానర్, ఓ స్టోరీ డివిజన్, ప్రత్యేకంగా యూత్ బ్యాచ్ తో ఈ కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేస్తారట.
అన్నపూర్ణ థియేటర్ స్కూలు అవుట్ గోయింగ్ బ్యాచ్ లో బెటర్ పీపుల్ ను కూడా ఎంపిక చేసి, ఇందులోకి తీసుకుంటారని తెలుస్తోంది.
బిడ్డా రాస్కో.. తెలంగాణలో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్