ఈనెలాఖరులో వస్తోంది చిరకాలంగా ఎదురుచూస్తున్న రోబో 2.0. శంకర్ డైరక్షన్ లో రజనీకాంత్ నటించిన అయిదు వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమా. తెలుగు థియేటర్ హక్కులే 80కోట్ల దగ్గరలో అమ్ముడుపోయాయి. అలాంటి సినిమా ఈ నెలాఖరున 29న విడుదలవుతోంది. సాధారణంగా ఇలాంటి సినిమా వస్తుంటే, మరోవారం అవతల వరకు మిగిలిన సినిమాలు దూరం వుంటాయి.
కానీ ఈ సినిమాకు పోటీగా అన్నట్లు విడుదల అవుతోంది అయిదుకోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఓ చిన్న సినిమా. భైరవ గీత అంటూ కొత్తవాళ్లతో, కొత్త దర్శకుడు సిద్దార్థ అందిస్తున్న సినిమా. ఇప్పటికే ఈ సినిమా పబ్లిసిటీ మెటీరియల్ జనాలకను ఆకట్టుకుంటోంది.
ఆర్జీవీ ప్రెజెంట్స్ అన్న ట్యాగ్ లైన్ ఒకటి వుంది. జస్ట్ ఇరవై ఏళ్లు దాటిన కుర్రాడు అందిస్తున్న సినిమా ఇది. వెస్ట్ గోదావరికి చెందిన సిద్దార్ధ డైరక్టర్ గా అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించారు. ఇంతకీ రోబో 2.0 లాంటి భారీ సినిమా వస్తుంటే, ఇదెందుకు అంటే, ఒకటే ధైర్యం అంట.
రోబో 2.0 సినిమా భారీ సినిమా కావడంతో అందరు థియేటర్ల వాళ్లు దాన్ని భరించలేరు. లక్షలకు లక్షలు అడ్వాన్స్ లు పంపలేరు. అలాంటి థియేటర్లకు ఫీడింగ్ గా ఈ సినిమా వుంటుంది. పైగా ఈ తరహా సినిమాలను ఇష్టపడే వారికి రోబో 2.0 లాంటివి ఎక్కవు. వాళ్లకు ఇలాంటివే కావాలి.
సో, అయిదు కోట్ల బడ్జెట్ రెండు రాష్ట్రాలకు కలిపి అంటే పెద్దగా రిస్క్ కాదు. అందుకే ఈనెల 30న విడుదల చేస్తున్నారు భైరవ గీత సినిమాను.
బిడ్డా రాస్కో.. తెలంగాణలో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్