విశాల్ లుక్ వచ్చింది

టెంపర్ సినిమా తెలుగులో ఎన్టీఆర్ కు టర్నింగ్ పాయింట్. ఆ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలని రెండేళ్లుగా అనుకుంటున్నారు టాగోర్ మధు. ఆఖరికి ఇప్పటికి కుదరింది. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ డైరక్షన్…

టెంపర్ సినిమా తెలుగులో ఎన్టీఆర్ కు టర్నింగ్ పాయింట్. ఆ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలని రెండేళ్లుగా అనుకుంటున్నారు టాగోర్ మధు. ఆఖరికి ఇప్పటికి కుదరింది. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ డైరక్షన్ లో ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. చెన్నయ్ తీరంలో, అలాగే విశాఖ తీరంలో షూట్ చేసారు.

దీంతో కొంతభాగం పూర్తికావడంతో ఫస్ట్ లుక్ గా విశాల్ మేకోవర్ ను ఈరోజు విడుదల చేసారు. దీన్ని దర్శకుడు మురుగదాస్ విడుదల చేయడం విశేషం. కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ అన్నదానికి సింబాలిక్ గా, యూనిఫారమ్ లో, పోలీస్ జీప్ మీద బీర్ బాటిల్ పట్టుకుని కూర్చున్న విశాల్ స్టిల్ డిజైన్ చేసారు. విశాల్ కాస్త వెయిట్ తగ్గి, క్లీన్ షేవ్, స్టిఫ్ ఫేస్ తో కనిపిస్తున్నాడు.

టెంపర్ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా తీస్తూనే, క్లయిమాక్స్ ను మాత్రం మరికాస్త రెవెల్యూషనరీగా మారుస్తున్నారు. తెలుగులో పోసాని వేసిన కీలక రోల్ ను తమిళంలో కేఎస్ రవికుమార్ చేస్తున్నారు.

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్