అన్ని విధాలా చెడుతున్న ‘విజయ్’

విజయ్ ఆంటోనీ. అదోరకం టిపికల్ ఫేస్. కొన్ని తరహా పాత్రలకు పనికి వస్తుంది. బిచ్చగాడు హిట్ కావడంతో, చకచకా సినిమాలు చేయడం సంగతి అలా వుంచి, తెలుగు మార్కెట్ మీద విపరీతమైన నమ్మకం పెట్టకున్నారు.…

విజయ్ ఆంటోనీ. అదోరకం టిపికల్ ఫేస్. కొన్ని తరహా పాత్రలకు పనికి వస్తుంది. బిచ్చగాడు హిట్ కావడంతో, చకచకా సినిమాలు చేయడం సంగతి అలా వుంచి, తెలుగు మార్కెట్ మీద విపరీతమైన నమ్మకం పెట్టకున్నారు. కానీ ఇప్పుడు రాను రాను పరిస్థితి ఎలా తయారవుతోంది అంటే, విజయ్ ఆంటోనీ సినిమా అంటే ఫ్రీగా అడిగేటట్లు వుంది.

అతగాడి తాజా సినిమా రోషగాడు విడుదలకు ముందు ఓన్లీ తెలుగు థియేటర్లకు 75 లక్షలకు అడిగారు. దీన్నిబట్టి అర్థం అవుతుంది. మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో? ఆఖరికి శాటిలైట్ తో కలిపి కోటి రూపాయలకు ఇచ్చేసారు.

ఇదంతా విజయ్ ఆంటోనీ సరైన ప్లానింగ్ చేసుకోకపోవడమే అని టాక్ వినిపిస్తోంది. విజయ్ ఆంటోనీ ఒకరిని, ఆయన భార్య మరొకరి, తమ సినిమాల వ్యవహారాలు చూడడానికి పెడుతూ వుంటారు. వీళ్లు చాలక నిర్మాత తరపున ఇంకొకరు ఎంటర్ అవుతారు. ఈలోగా బేరం కుదిర్చినందుకు మరొకళ్లు రెడీ అంటారు.

ఇలా ఇంతమంది కలిసి సినిమా పబ్లిసిటీ బడ్జెట్ ను కాస్తా అరకొర చేసేస్తారు. పైగా ప్రతిసారీ ఓ కొత్త నిర్మాత రంగప్రవేశం చేయడంతో, రాంగ్ గైడెన్స్ తో మునిగిపోతున్నారు. టోటల్ గా ఎవరు లాస్ అవుతున్నారు అంటే విజయ్ ఆంటోనీ.

నానాటికీ తీసికట్టు, నామం బొట్టు అన్నట్లు, అతగాడి మార్కెట్ అలా అలా పడిపోతోంది. ఆఖరికి తరువాత సినిమాకు ఇక్కడకు చెన్నయ్ కు తిరిగే ఫ్లయిట్ ఖర్చులంత కూడా వుంటుందో, వుండదో?

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్