మహర్షిలో మరో హీరోయిన్ కూడా!

మహర్షి సినిమాలో మహేష్ బాబు సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ లోనే పూజాహెగ్డే పాల్గొంది. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో…

మహర్షి సినిమాలో మహేష్ బాబు సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ లోనే పూజాహెగ్డే పాల్గొంది. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు సోనాల్ చౌహాన్.

అవును… తొలిసారిగా మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది సోనాల్. మహర్షి సినిమాలో ఈమె కూడా ఉంది. సినిమాలో స్టూడెంట్ గా, బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ గా, రైతుల సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా.. ఇలా 3 షేడ్స్ లో కనిపించబోతున్నాడు మహేష్.

స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కోటీశ్వరుడిగా కనిపించే టైమ్ లో మహేష్ కు సోనాల్ కనెక్ట్ అవుతుందట. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా మెహ్రీన్ ను అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ అవకాశం సోనాల్ చౌహాన్ ను వరించింది.

తెలుగులో లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్ లాంటి సినిమాల్లో నటించింది సోనాల్ చౌహాన్. రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది మహర్షి సినిమా. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ విలేజ్ సెట్ వేశారు.

ఈ సెట్ లోనే నెక్ట్స్ షెడ్యూల్ షురూ అవుతుంది. సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది ఈ సినిమా.

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్