తన ప్రేయసిలందరినీ ఒకే రీతిన ట్రీట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు రణ్ బీర్ కపూర్. వరసగా హీరోయిన్లతో ప్రేమాయణాలను నడిపిస్తూ.. బ్రేకప్ లు చెప్పేస్తూ లవ్ లైఫ్ లో సాగిపోతున్న ఈ హీరో.. ఇప్పుడు అలియా భట్ తో ప్రేమాయణాన్ని సాగిస్తున్న సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరూ గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ ధ్రువీకరించారు. రూమర్ గా మొదలైన వీరి ప్రేమ చివరకు నిజమే అయ్యింది. తామిద్దరం ఒకరికి మరొకరు చాలా ప్రత్యేకమని వీరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు.
ఇప్పుడు బాలీవుడ్ సమాచారం ఏమిటంటే.. వీరిద్దరూ ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో మకాం పెట్టారనేది. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఒక ఖరీదైన హోటల్లో వీళ్లు మకాం పెట్టేశారని, అక్కడే భారీగా అద్దె చెల్లిస్తూ స్టే చేస్తున్నారని అంటున్నారు.
అలియా, రణ్ బీర్ ల రొమాంటిక్ స్టే అది ప్రచారం జరుగుతోంది. అయితే రణ్ బీర్ కు ఇలాంటివేమీ కొత్తకాదు. గతంలో కత్రినాకైఫ్ తో కూడా ఇదే తరహాలో మకాంపెట్టారు. ఒక ఖరీదైన ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని అప్పట్లో రణ్ బీర్, కత్రినాలు దాన్ని తమ లవ్ నెస్ట్ గా మలుచుకున్నారు.
తమ లవ్ నెస్ట్ ను రకరకాలుగా డెకరేట్ కూడా చేసుకుంది కత్రినా. అయితే అదంతా కొన్నాళ్ల ముచ్చటే అయ్యింది. పెళ్లి చేసుకుని లవ్ నెస్ట్ నుంచి వాళ్లు స్వీట్ హోమ్ కు మూవ్ కానున్నారు అనే వార్తల సమయంలో బ్రేకప్ అని చెప్పేశారు.
ఇక ఇప్పుడు అలియాతో లవ్ నెస్ట్ లో చేరిపోయాడు రణ్ బీర్. ఇంతకీ పెళ్లెప్పుడు అంటే.. త్వరలోనే.. అంటున్నాడు ఈ హీరో.
బిడ్డా రాస్కో.. తెలంగాణలో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్