హారిక హాసిని సంస్థతో డైరక్టర్ త్రివిక్రమ్ బంధం పెనవేసుకుపోయింది. చినబాబు-త్రివిక్రమ్ ఒక ఇంటి మనుషుల్లా కలిసిపోయారు. త్రివిక్రమ్ కష్టంలో, సుఖంలో వారే వెంట వుంటున్నారు. అందుకే ఇక బయట ప్రొడ్యూసర్లకు సినిమా చేయకూడదని త్రివిక్రమ్ డిసైడ్ అయిపోయారు.
కానీ ఏనాడో మైత్రీ మూవీస్ ఇచ్చిన అడ్వాన్స్ అలా వుంది. అందుకే ఇప్పుడు దాన్ని చెల్లగొట్టేయాలని హారిక సంస్థ ఆలోచిస్తున్నట్లు, ఈ మేరకు చర్చలు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయినపుడు చకచకా అటు హీరోలకు, ఇటు డైరక్టర్లకు అడ్వాన్స్ లు ఇచ్చింది.
అప్పటి అడ్వాన్స్ నాలుగు కోట్ల వరకు అలా వుంది. ఇప్పుడు ఈ అడ్వాన్స్ ను మైత్రీకి తాము ఇచ్చేయాలని హారిక సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంప్రదింపులు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మైత్రీ ఇచ్చిన అడ్వాన్స్ మహేష్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి. అది ఇప్పట్లో పాజిబుల్ కాదు.
ఎందుకంటే మైత్రీకి సుకుమార్ తో సినిమా చేసిన తరువాత మళ్లీ వెంటనే మహేష్ సినిమా చేయడు కదా? దానికి మరో రెండేళ్లు టైమ్ పడుతుంది. అంటే మూడు నాలుగేళ్ల తరువాత సంగతి. అందుకే మైత్రీ కూడా అడ్వాన్స్ వెనక్కు తీసుకునే విషయంలో సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇన్నేళ్ల తరువాత సినిమా చేయకుండా, అడ్వాన్స్ వెనక్కు ఇవ్వడం అంటే, వడ్డీ ఇవ్వాలని మైత్రీ సంస్థ కోరుతున్నట్లు వినిపిస్తోంది. నాలుగు కోట్లు అడ్వాన్స్ ప్లస్ మూడు కోట్లు వడ్డీ ఇవ్వమని అడుగుతున్నట్లు బోగట్టా.
సాధారణంగా అడ్వాన్స్ లకు వడ్డీలు ఇచ్చే పద్దతి టాలీవుడ్ లో లేదు. అది నిర్మాతలకు, తీసుకున్న వారికి మధ్య జరిగే పంచాయతీ మీద ఆధారపడి వుంటుంది. ఇదిలా వుంటే బన్నీతో చేసే సినిమా విషయంలో కూడా హారిక నా? గీతానా? కాంబోనా? లేదా రాయల్టీనా? అన్న డిస్కషన్లు ఇంకా సాగుతున్నాయి.
బిడ్డా రాస్కో.. తెలంగాణలో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్