ఖాళీగా వున్న పెద్ద డైరక్టర్లు ఏం చేస్తారు? ఏ పెద్ద హీరో ఖాళీగా వున్నాడా? అని చూస్తారు. ఇప్పుడు అలా అందరికీ కనిపిస్తున్న హీరో అల్లు అర్జున్. అందుకే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇంకోపక్క డైరక్టర్ త్రివిక్రమ్ కథ అల్లుతూనే వున్నారు.
ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా జస్ట్ వన్ డే బ్యాక్ వచ్చి, బన్నీకి కథ చెప్పేసాడట. గౌతమ్ మీనన్ సరైన హిట్ లేక కిందామీదా అవుతున్నారు. సినిమాలు స్టార్ట్ చేసి, ఏళ్ల తరబడి తీస్తారనే అపప్రథ మూట కట్టుకున్నారు.
దాంతో ఇప్పుడు నిర్మాణంలో వేలుపెట్టను, కేవలం డైరక్షన్ మాత్రమే చేస్తాను. అది కూడా ఒక్క లాంగ్వేజ్ లోనే, అంటూ నిర్మాతలు, హీరోలను సంప్రదిస్తున్నారట గౌతమ్ మీనన్. అందులో భాగంగానే బన్నీని కలిసి మాంచి స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది.
బన్నీ ఎస్ ఆర్ నో చెప్పకుండా, అలాగే ఆలోచిస్తాను అని చెప్పినట్లు బోగట్టా. ఆల్రెడీ గతంలో విక్రమ్ కుమార్ కథ చెప్పడం, దాన్ని కిందామీదా మిక్సీలో తిప్పి, తిప్పి, ఆఖరికి వెనక్కు వెళ్లిపోవడం అయిపోయింది. ఇప్పుడు గౌతమ్ మీనన్ వంతు వచ్చిందన్నమాట.
కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్