ఆ ముగ్గురి కష్టం టాక్సీవాలా

ఇటు గీతా2 సంస్థ, అటు యువి సంస్థ పుల్ ఖుషీగా వున్నాయి. తాము ఇద్దరు కలిసి నిర్మించిన చిన్న సినిమా టాక్సీవాలాకు మంచి టాక్ వచ్చింది. ముగ్గురు మిత్రులు బన్నీవాస్, యువి వంశీ, డైరక్టర్…

ఇటు గీతా2 సంస్థ, అటు యువి సంస్థ పుల్ ఖుషీగా వున్నాయి. తాము ఇద్దరు కలిసి నిర్మించిన చిన్న సినిమా టాక్సీవాలాకు మంచి టాక్ వచ్చింది. ముగ్గురు మిత్రులు బన్నీవాస్, యువి వంశీ, డైరక్టర్ మారుతిల కష్టం ఇది. మారుతి కొత్త దర్శకుడు చెప్పిన కథ విని,  తాను, తన మిత్రులు కలిసి చేయాలనుకున్న ప్రాజెక్టును వంశీకి ఇచ్చారు. ఆయన బన్నీ వాస్ ను కలుపుకున్నారు.

ముగ్గురు కలిసి చిన్న సినిమాగా, ఎప్పుడో స్టార్ట్ చేసి, ఫినిష్ చేసారు. పెట్టుబడి బన్నీవాస్, వంశీలది. మారుతిది ఐడియా, ప్లానింగ్. అయితే సాహు పనుల్లో బిజీగా వున్న వంశీ వీలు చూసుకుని, సినిమాను చూసి, తన స్టయిల్ లో కూడికలు, తీసివేతలు చేసారు. ఆ తరువాత గ్రాఫిక్స్ అప్ టు ది మార్క్ లేవని అవన్నీ సరిచేయించి, బన్నీ వాస్ చేతిలో పెట్టారు.

ఆ తరువాత సీన్ లో మారుతి ఎంటర్ అయ్యారు. ఒకటికి నాలుగుసార్లు కాపీ చెక్ చేసి, మూడుగంటలకు పైగా వున్న ఫుటేజ్ ను ఓ షేప్ కు తీసుకువచ్చారు. సెన్సారుకు ఇచ్చిన తరువాత కూడా మారుతి, బన్నీవాస్ కలిసి మళ్లీ కాపీని ఓ చెక్కుడు చెక్కారు. 

ఈ మధ్యలో కాపీ ఫైరసీ అయినా పెద్దగా భయపడలేదు. ఎందుకంటే ఖర్చులు, ఆదాయం అన్నీ లెక్కలేసుకున్నా, నాలుగు కోట్ల బర్డెన్ వుంది. ఆ మాత్రం వసూళ్లు ఫస్ట్ వీకెండ్ లోనే వస్తాయి. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్లారు. ఇప్పుడు ఫస్ట్ డేనే దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్లు వుంది పరిస్థితి.

ఓవర్ సీస్ కు 90 లక్షలకు విజయ్ దేవరకొండ ఆయన మిత్రులు తీసుకున్నారు. అక్కడ పైసాకు పైసా మిగిలేలా వుంది. మొత్తంమీద ముగ్గురు మిత్రులు బన్నీవాస్, యువి వంశీ, మారుతిలు కలిసి మళ్లీ మరో హిట్ కొట్టారు. త్వరలో ఈ ముగ్గురి కాంబినేషన్ లో పెద్ద సినిమానే రాబోతోంది.

బన్నీ పార్టీ
సినిమా హిట్ అయితే పార్టీ ఇవ్వడం, అభినందించడం అన్నది ఓ కాన్సెప్ట్ గా పెట్టుకున్నాడు హీరో బన్నీ. లేటెస్ట్ గా టాక్సీవాలా టీమ్ కు కూడా పార్టీ ఇచ్చాడు. తను భాగస్వామిగా వున్న బి-డబ్స్ రెస్టారెంట్ ప్రారంభమై ఏడాది అయింది. ఈ రెండు అకేషన్లను కలిపి సెలబ్రేట్ చేసాడు బన్నీ.

టాక్సీవాలా యూనిట్ ను, ప్రాజెక్టు రూపకల్పన చేసిన దర్శకుడు మారుతిని, పీఆర్ టీమ్ ను పిలిచి పార్టీ ఇచ్చి, ప్రత్యేకంగా అభినందించాడు బన్నీ. 

సినిమా రివ్యూ: టాక్సీవాలా

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్