cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

వీడి.. స్టామినా మామూలుగా లేదుగా

వీడి.. స్టామినా మామూలుగా లేదుగా

విజయ్ దేవరకొండ.. ఎవరు ఎంత కాదన్నా, యూత్ లో అతగాడి క్రేజ్ ఇంతా అంతా కాదు. అతని టైమ్ నడుస్తోంది ఇప్పుడు. టాక్సీవాలా సినిమా మీద ఎవ్వరికీ ఎ హోప్ లేదు. నోటా సినిమా ఫ్లాప్ అయింది. మరోపక్క టాక్సీవాలా సినిమా మొత్తం రాఫుటేజ్ లీక్ అయింది. రవితేజ-శ్రీనువైట్ల లాంటి భారీ కాంబినేషన్ లో అమర్ అక్బర్ ఆంధోని విడుదలయింది. దానికి తగ్గి ఓ రోజు వెనక్కు వచ్చింది టాక్సీవాలా.

కానీ విడుదల రోజు కలెక్షన్లు చూస్తే, దటీజ్ విజయ్ దేవరకొండ అనిపించేలా వున్నాయి. నాలుగుకోట్ల బర్డెన్ తో డైరక్ట్ రిలీజ్ అయింది టాక్సీవాలా. యువి, గీతా కలిపి నిర్మించడమే కాదు, పంపిణీ చేసుకున్నారు. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు చాలా ఏరియాల్లో అమర్ అక్బర్ ఆంథోని తొలిరోజు కలెక్షన్లు వెలవెలబోయేలా ఓపెనింగ్స్ తెచ్చుకుంది.

ఓవర్ సీస్ లో అయితే ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల లాంగ్ రన్ ఫిగర్ ను తొలిరోజే తెచ్చుకుంది. ఇదంతా చూస్తుంటే టాక్సీవాలా ఫుల్ రన్ లో ఇటు డొమస్టిక్ మార్కెట్ లో, అటు ఓవర్ సీస్ లో మంచి ఫలితాలు నమోదు చేసేలా కనిపిస్తోంది.

కలెక్షన్ల వివరాలు
నైజాం...............1.46
ఉత్తరాంధ్ర..........39.97
సీడెడ్................39
ఈస్ట్...................19.26
వెస్ట్....................15.91
కృష్ణ...................24.89
గుంటూరు...........26.99
నెల్లూరు...............11.96
కర్ణాటక...................0.37
చెన్నై................0.13

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్