Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ లిస్ట్ లో మరో దర్శకుడు

రామ్ లిస్ట్ లో మరో దర్శకుడు

రీసెంట్ గా రామ్ మేకోవర్ అయ్యాడు. హెయిర్ స్టయిల్ పూర్తిగా మార్చేసి రఫ్ లుక్ లోకి వచ్చేశాడు. పూరి జగన్నాధ్ సినిమా కోసమే రామ్ ఇదంతా చేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే పూరి జగన్నాధ్ తో పాటు లిస్ట్ లోకి మారుతి కూడా వచ్చిచేరాడు.

అవును.. పూరితో కథాచర్చలు పూర్తిచేసిన రామ్, ప్రస్తుతం మారుతితో స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు కథల్లో దేనికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దర్శకుడు ఎవరైనా, రామ్ తన నెక్ట్స్ మూవీని స్రవంతి మూవీస్ బ్యానర్ పైనే చేస్తాడు.

వరుస ఫ్లాపులతో ఉన్నాడు పూరి జగన్నాధ్. చివరికి కొడుక్కి కూడా హిట్ ఇవ్వలేకపోయాడు. ఇటు మారుతి కూడా శైలజారెడ్డి అల్లుడు సినిమాతో విమర్శల పాలయ్యాడు. ఉన్నంతలో సినిమా గట్టెక్కింది కానీ, మారుతి స్టామినాపై మాత్రం అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీళ్ల ట్రాక్ రికార్డ్స్ ను దృష్టిలో పెట్టుకొని రామ్ అవకాశమిస్తాడా.. లేక కథకు ప్రయారిటీ ఇస్తాడా అనేది చూడాలి.

మరోవైపు రామ్ నే నమ్ముకొని ఉన్న ఔత్సాహిక రైటర్స్, దర్శకులు కొందరు దుకాణం సర్దేశారు. ఈ హీరో దగ్గర దాదాపు ఐదుగురు రచయితలు కమ్ దర్శకులు ఉన్నారు. గడిచిన రెండేళ్లుగా రామ్ కోసం వాళ్లు రకరకాల కథలు వండివార్చారు. ఇప్పుడా కథలతో పాటు వాళ్లందర్నీ రామ్ పక్కనపడేశాడు.

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?