దటీజ్ శేఖర్ కమ్ముల

అందరు డైరక్టర్లు ఒకలా వుండరు. కొందరు వేరే.. శేఖర్ కమ్ముల ఆ బాపతు. ఫిదాతో పెద్ద హిట్ కొట్టారు. తరువాత కచ్చితంగా ఆఫర్లు వెల్లువెత్తుతాయి. అది కామన్. పైగా శేఖర్ కమ్ముల మంచి డైరక్టర్…

అందరు డైరక్టర్లు ఒకలా వుండరు. కొందరు వేరే.. శేఖర్ కమ్ముల ఆ బాపతు. ఫిదాతో పెద్ద హిట్ కొట్టారు. తరువాత కచ్చితంగా ఆఫర్లు వెల్లువెత్తుతాయి. అది కామన్. పైగా శేఖర్ కమ్ముల మంచి డైరక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు గతంలోనే. అందువల్ల ఫిదా తరువాత ఆయనకు మంచి మంచి అడ్వాన్స్ లు ఆఫర్లే వచ్చాయి. కానీ ఆయన ఒక్కటే సినిమా ఓకే చేసారు.

సరే, సినిమాకు కొత్త హీరో కావాలి. ఫైనల్ లిస్ట్ లోకి నిర్మాత డివివి దానయ్య కుమారుడు, మరో ఏ బ్యాకింగ్ లేని కుర్రాడు వచ్చారు. అన్ని విధాలా పరీక్షలు చేసి, చేసి, ఆఖరికి శేఖర్ కమ్ముల ఏ బ్యాకింగ్ లేని కుర్రాడినే తీసుకున్నారు. నిజానికి ఇదే ప్లేస్ లో ఇంకెవరైనా వుంటే దానయ్య లాంటి నిర్మాత కొడుకుకు కాస్త ఫ్రయారిటీ ఇచ్చేవారేమో?

నిజానికి దానయ్య కొడుకు కూడా హీరో మెటీరియల్ వున్నవాడే. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఈ సినిమాలో హీరో పక్కా పక్కింటి కుర్రాడిలా సాదా సీదాగా వుండాలి. మళ్లీ ఫైట్లు, డ్యాన్స్ లు విరగదీయాలి. దానయ్య కొడుకు అంత సాదా సీదాగా వుండడు. కాస్త గ్లామరస్ గా వుంటాడు. అది వద్దట శేఖర్ కమ్ములకు. అందుకే దానయ్యకు సారీచెప్పి, ఆ కొత్త కుర్రాడినే తీసుకున్నాడట.

ఇదిలా వుంటే సినిమా ఓకె అయితే చాలు, ఆఫీసు తీయించడం, కారు హంగామా వుంటుంది చాలామంది డైరక్టర్లకు. కానీ శేఖర్ కమ్ముల తనకు ఆఫీస్ వద్దని చెప్పేసాడట. సికిందరాబాద్ పద్మారావు నగర్ లోని తన ఇంటిలోని చిన్న గదిలోనే, తను, తన టీమ్ మొత్తం ఈ సినిమా పనులు చూసుకుంటున్నారట.

టాలీవుడ్ లెక్కల ప్రకారం కాస్త డిఫరెంట్ పర్సనాలిటీ శేఖర్ కమ్ముల. కచ్చితంగా.

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్