పవన్ సినిమా పోస్టర్ కు ‘పచ్చ’ కలరింగ్

పవన్ కల్యాణ్ పేరు చెబితేనే పూనకంతో ఊగిపోయేవారంతా. సినిమా ఎలా ఉన్నా కూడా నెగెటివ్ టాక్ చెప్పడానికి భయపడేవారు. పవన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు.…

పవన్ కల్యాణ్ పేరు చెబితేనే పూనకంతో ఊగిపోయేవారంతా. సినిమా ఎలా ఉన్నా కూడా నెగెటివ్ టాక్ చెప్పడానికి భయపడేవారు. పవన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. ఇదంతా గతం.. రాజకీయాల్లోకి వచ్చి పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఇమేజ్ డ్యామేజీ చేసుకున్న పవన్ ని విమర్శించడానికి ఇప్పడెవరూ వెనకాడ్డంలేదు. సోషల్ మీడియాలో అయితే ఆ చెడుగుడు వర్ణనాతీతం.

తాజాగా పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం 5 గంటలకు అంటూ.. ఓ అధికారిక పోస్టర్ బైటకొచ్చింది. విచిత్రం ఏంటంటే.. ఈ పోస్టర్ లో యెల్లో కలర్ హైలెట్ కావడం. పసుపు పచ్చ బ్యాక్ గ్రౌండ్ పై బ్లాక్ లెటర్స్ తో #PSPK26 వివరాలు తెలియజేశారు. దీంతో పవన్ యాంటీ బ్యాచ్ హంగామా స్టార్ట్ చేసింది. ఇన్నాళ్లూ పచ్చబ్యాచ్ తో కలిసి తిరిగిన పవన్ కల్యాణ్.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత ఫ్రెండ్ షిప్ మర్చిపోలేకపోయారంటూ ట్రోలింగ్ మొదలైంది.

ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నారు కాబట్టి నల్లకోటుకి సింబాలిక్ గా నల్లక్షరాలు రాశారనుకుందాం. అది హైలెట్ కావాలంటే.. తెలుపు, ఎరుపు.. ఇంకేదైనా మిక్స్ డ్ కలర్ కూడా వాడుకోవచ్చు. కానీ మేకర్స్ మాత్రం పూర్తిగా పసుపు పచ్చ బ్యాక్ గ్రౌండ్ వాడడంతో పవన్ బుక్కయ్యారు. దీంతో పవన్ ని మరోసారి యెల్లోబ్యాచ్ అంటూ టార్గెట్ చేశారు. పవన్ ఫస్ట్ లుక్ హ్యాష్ ట్యాగ్ లతో పాటు ఈ సెటైర్లు కూడా వైరల్ అవుతున్నాయి. 

ఇన్నాళ్లూ ఎల్లో బ్యాచ్ కి వకాల్తా పుచ్చుకుని పవన్ మాట్లాడారని, దానికి సింబాలిక్ గా ఈ పోస్టర్ ఉందని సెటైర్లు పేలుతున్నాయి. నిజానికి ఈ విషయంలో పవన్ ప్రమేయం లేదు. ఒకప్పట్లా తన సినిమాలకు సంబంధించి ఎడిటింగ్ టేబుల్ నుంచి ఫస్ట్ లుక్ వరకు పవన్ వేలు పెట్టడం లేదు. తన పనేదో తాను చేసుకుపోతున్నారు. దీంతో పవన్ తో సంబంధం లేకుండానే ఈ పోస్టర్ వచ్చింది. పాపం దాని ప్రతిఫలం మాత్రం ట్రోలింగ్ రూపంలో పవన్ అనుభవిస్తున్నారు.