విశాఖ ఎయిర్ పోర్టు బయట నెలకొన్న హైడ్రామాపై పోలీసులు కేసులతో స్పందించారు. చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల ఫార్ములాకు వ్యతిరేకి అని, ఉత్తరాంధ్ర కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారని అంటూ విశాఖ ఎయిర్ పోర్టు బయట చంద్రబాబును ఆందోళన కారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించిన విషయమూ తెలిసిందే. తనను ఏ సెక్షన్ ప్రకారం అడ్డుకున్నారో చెప్పాలంటూ చంద్రబాబు నాయుడు పోలీసుల మీద, ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎయిర్ పోర్టు బయట కొన్ని గంటల పాటు ఉండిన చంద్రబాబు నాయుడు తిరిగి చేసేది లేక వెనుదిరిగారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లే ప్రకటన కూడా చేశారు.
ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడును అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమందిని గుర్తించి కేసులు నమోదు చేశారట. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు, మీడియాలో ప్రసారమైన వీడియో కథనాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అక్కడ తోపులాట చేసుకోవడం మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకూ పోలీసులు గుర్తించిన వివరాల మేరకు.. చంద్రబాబు నాయుడును అడ్డుకున్న వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు ఉన్నారు. వారందరి మీదా కేసులు నమోదు చేసినట్టుగా, మరికొందరు ఎవరనే విషయాలను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మొత్తం గొడవ విషయంలో 36 మంది మీద కేసులు నమోదు చేశారట పోలీసులు. వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 21 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 15 మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా సమాచారం. ఆందోళన కారులపై వీళ్లు దాడికి పాల్పడట్టుగా తెలుస్తోంది. వైసీపీ రౌడీయిజం అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటే, 15 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. అయితే మరింతమంది తెలుగుదేశం కార్యకర్తలు తమపై దాడి చేశారని, వారిని పోలీసులు వదిలిపెడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మేరకు వారు ఎయిర్ పోర్ట్ పోలిస్ స్టేషన్ బయట నిరసన తెలిపారు.
బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు