ఆర్ఎఫ్సీలో.. మహేష్ విలేజ్

ఆ మధ్య రామ్ చరణ్ రంగస్థలం సినిమా కోసం ఓ విలేజ్ సెట్ ను ప్రత్యేకంగా వేయించారు దర్శకుడు సుకుమార్. జూబ్లీహిల్స్ లోని ఓ కొండగుట్టపై 80వ దశకం నాటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా…

ఆ మధ్య రామ్ చరణ్ రంగస్థలం సినిమా కోసం ఓ విలేజ్ సెట్ ను ప్రత్యేకంగా వేయించారు దర్శకుడు సుకుమార్. జూబ్లీహిల్స్ లోని ఓ కొండగుట్టపై 80వ దశకం నాటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్ వేసారు. ఇప్పుడు మళ్లీ మరో విలేజ్ సెట్ రెడీ అవుతోంది. 

ఈసారి ఈ సెట్ మహేష్ బాబు సినిమా మహర్షి కోసం. ఈ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్ నటిస్తున్న మహర్షి సినిమా మూడు భాగాలుగా వుంటుంది. ఒకటి హీరో స్టూడెంట్ లైఫ్. రెండోది హీరో బడా ఎంటర్ పెన్యూర్ గా ఎదగడం. మొదటిది డార్జిలింగ్ లోనూ, రెండవది అమెరికాలోనూ షూట్ చేసారు.

మూడోభాగం సినిమాకు కీలకం. రైతుల సమస్యలు, ఆధునిక సేద్యం, ఎరువులు, పురుగుమందులు లేని పంట, లాభసాటి వ్యవసాయం ఇతరత్రా వ్యవహారాలు ఈ భాగంలో వున్నాయి. ఇందుకోసమే రామోజీ ఫిలిం సిటీలోని పంటచేలకు సమీపంలో ఓ విలేజ్ సెట్ ను భారీగా రూపొందిస్తున్నారు. ఇందులో ఆ మూడోభాగం షూటింగ్ వుంటుందన్నమాట. అదీ సంగతి.

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్