Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి రేంజ్ టైటిల్ కావలెను

బాహుబలి రేంజ్ టైటిల్ కావలెను

ఒకపక్క ఆర్ ఆర్ ఆర్ సినిమా యాక్షన్ సీన్ల కోసం రామ్ చరణ్-ఎన్టీఆర్ రిహార్సల్స్ చేస్తున్నారు. మరోపక్క రాజమౌళి వేరే విధమైన కుస్తీ పడుతున్నారు. సినిమాకు సరైన టైటిల్ కోసం ఆయన తన ఫ్యామిలీ టీమ్ తో తెగ డిస్కషన్లు సాగిస్తున్నట్లు బోగట్టా. ఆర్ఆర్ఆర్ నే ఫైనల్ టైటిల్ అని, రామ రావణ రాజ్యం అన్నది దాని ఫుల్ ఫామ్ అని గ్యాసిప్ లు వచ్చాయి.

కానీ అవేవీ నిజంకాదు. బాహుబలి మాదిరిగా ఒక మల్టీ లాంగ్వేజ్ అప్పీల్ వున్న టైటిల్ లో రాజమౌళి అండ్ కో ఇప్పుడు తెగ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషలకు ఒకటే టైటిల్ వుండాలి. అంటే ఆ టైటిల్ మూడు భాషలకు పరిచయం అయిన పదం అయి వుండాలి. అదీ ఆలోచన. సాధారణంగా సంస్కృతం మూల భాష కాబట్టి, ఆ టచ్ వున్నపదం అయితే సరిపోతుంది.

అలాంటి యాప్ట్ పదం దొరకాలి. దాన్ని టైటిల్ గా ఫిక్స్ చేయాలి అని రాజమౌళి ఆలోచిస్తున్నారట. సాధారణంగా టైటిల్ ను, సబ్జెక్ట్ ను సస్పెన్స్ లో వుంచడం అన్నది రాజమౌళి పద్దతికాదు. అందుకే రెండో షెడ్యూలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే లోగానే టైటిల్ ప్రకటించేస్తారట.

ఇదిలా వుంటే హీరోయిన్ల ఎంపికను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతుంది. ఆ షెడ్యూలులో హీరోయిన్లతో పనిలేదు. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు రాజమౌళి కొడుకు కార్తీక్ పెళ్లి హడావుడి. ఫిబ్రవరిలో రెండో షెడ్యూలు. అప్పటికి హీరోయిన్లు కావాలి.

సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తారు కాబట్టి, వీలయినంత వరకు నార్త్ లో పరిచయం వున్న హీరోయిన్లనే తీసుకునే ఆలోచన వున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?