రెండేళ్ల తరువాత పవన్ లుక్

2018 జనవరి 10న విడుదలయింది అజ్ఞాతవాసి సినిమా. ఓ డిజాస్టర్ మూవీ. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అంకితం అయిపోయారు. మళ్లీ రెండేళ్ల తరువాత సినిమాల్లోకి వచ్చారు. సినిమాలు మానేసా..ఆదాయం వదిలేసుకున్నా అన్న…

2018 జనవరి 10న విడుదలయింది అజ్ఞాతవాసి సినిమా. ఓ డిజాస్టర్ మూవీ. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అంకితం అయిపోయారు. మళ్లీ రెండేళ్ల తరువాత సినిమాల్లోకి వచ్చారు. సినిమాలు మానేసా..ఆదాయం వదిలేసుకున్నా అన్న ఆయనే, నాకేమైనా వేరే ఇన్ కమ్ వుందా అంటూ కొత్త పాయింట్లు లాగి మొహానికి రంగేసుకున్నారు.

ఇప్పుడు అలా మొదలు పెట్టిన పింక్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. పింక్ రీమేక్ కు రెండు పేర్లు వినిపించాయి. లాయర్ సాబ్..వకీల్ సాబ్. నిర్మాత దిల్ రాజు లాయర్ సాబ్ కు ఓటేసినా, హీరో పవన్ కు వకీల్ సాబ్ నచ్చడంతో అదే ఫైనల్ అయింది.

వకీల్ సాబ్ నుంచి వచ్చే పవన్ లుక్ మాత్రం వకీలు గా కాదు. చాలా క్యాజువల్ గా పవన్ రెగ్యులర్ సినిమాటిక్ గెటప్ లోనే వుంటుందని తెలుస్తోంది. పింక్ సినిమాను తెలుగులో కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే విధంగా, పవన్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా మారుస్తున్నారని అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ లుక్ కూడా అందుకు అనుగుణగానే వుంటుంది. 

ఇంటి ప‌నుల‌తో పాటు బాడీ మసాజ్ లు చేయిచుకుంటున్న యాంక‌ర్‌ ?