ప్రేమ.. కోరిక.. జీవితం

బాలీవుడ్ మేకర్ కునాల్ కోహ్లి తెలుగులో అందిస్తున్న సినిమా నెక్స్ట్ ఏంటీ? చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్, అసలు హిట్ అంటే ఏంటీ అనే నవదీప్ లను తీసుకుని,…

బాలీవుడ్ మేకర్ కునాల్ కోహ్లి తెలుగులో అందిస్తున్న సినిమా నెక్స్ట్ ఏంటీ? చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్, అసలు హిట్ అంటే ఏంటీ అనే నవదీప్ లను తీసుకుని, తమన్నా సెంట్రిక్ గా తయారుచేసిన మూవీ ఇది. బహుశా హీరోయిన్ కు ప్రాధాన్యత ఎక్కువ వుండి వుండాలి. అందుకే సందీప్, నవదీప్ లను తీసుకుని వుంటారేమో?

ఆ విషయం పక్కన పెడితే, తెలుగు సినిమాలు డిస్కస్ చేయడానికి కాస్త ఇబ్బందిపడే పాయింట్ ను తీసుకుని కథ తయారుచేసినట్లు కనిపిస్తోంది. అమ్మాయిలు-అబ్బాయిలు లేదా ఆడ-మగ మధ్య కోరిక మాత్రమేనా, ఇంకేమన్నా వుంటుందా?

సెక్స్ కు వున్న ప్రయారిటీ ఏమిటి? ఇలాంటి వితిన్ టూ పీపుల్ మధ్య డిస్కషన్ కు వుండే పాయింట్లు బేస్ చేసుకుని, చివరకు మనుషుల మధ్య అసలైన ప్రేమ కీలకంఅనే పాయింట్ దగ్గరకు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది విడుదలయిన ట్రయిలర్ చూస్తుంటే.

ట్రయిలర్ మాత్రం కలర్ ఫుల్ గా అందంగా వుంది. పైగా కాస్త జనాలను సినిమా వైపు లాగే డైలాగులు కూడా వున్నాయి..''కరెస్ట్ గా చేసినోడు దొరికితే వదలొద్దు..' లాంటి కసక్కు డైలాగులు వున్నాయి. సబ్జెక్ట్ మన తెలుగువాళ్లు డీల్ చేసేదికాదు, కానీ జనాలకు పట్టేదే కాబట్టి, ఈ సినిమాతో అయినా సందీప్ కిషన్ హిట్ కోరిక తీరుతుందేమో?