Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహానాయకుడు vs ప్రజానాయకుడు

మహానాయకుడు vs ప్రజానాయకుడు

తెలుగునాట వర్తమాన తరానికి గుర్తుండిపోయే రాజకీయ నాయకులు ఇద్దరు. ఎన్టీఆర్.. వైఎస్ఆర్. ఈ ఇద్దరి బయోపిక్ లు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ను కథానాయకుడు.. మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా తీస్తున్నారు. వైఎస్ఆర్ బయోపిక్ ను ప్రజానాయకుడు పేరిట తీస్తున్నారు.

సినిమా స్టార్ట్ చేసినపుడు వైఎస్ఆర్ బయోపిక్ ను సంక్రాంతికి విడుదల అని ప్రకటించారు. కానీ తరువాత డిసెంబర్ 21కి మార్చారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వేరే విధంగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండోభాగం అయిన మహా నాయకుడు ఎప్పుడు విడుదలకు ఫిక్స్ అయితే, దానికి పక్కనో, అదే రోజో మహా నాయకుడు కూడా విడుదల చేసే ఆలోచనలో ఆ సినిమా నిర్మాతలు వున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 జనవరి 25న అని ప్రకటించారు. కానీ అది ఫిబ్రవరి 14కు వెళుతుందని గ్యాసిప్స్ వున్నాయి. అలా అయితే వైఎస్ఆర్ బయోపిక్ కూడా డిసెంబర్ లో కాకుండా ఫిబ్రవరిలోనే వస్తుందన్నమాట.

ఒక విధంగా ఇది సరైన నిర్ణయమే. సోలోగా వస్తే జనాలకు తెలిసే దానికన్నా, పోటాపోటీగా వస్తే వచ్చే పబ్లిసిటీ వేరుగా వుంటుంది కదా?

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?