ఈసారి బోయపాటి ఐటమ్ ఎవరో?

దర్శకుడు బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు మాత్రమేకాదు, అయిటమ్ నెంబర్లు కూడా స్పెషలే. లెజండ్ లో హంసా నందిని.. జయజానకి నాయకలో ప్రగ్య జైస్వాల్.. సరైనోడులో అంజలి, ఐటమ్ సాంగ్స్ లో కనిపించి, మెరిపులు…

దర్శకుడు బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు మాత్రమేకాదు, అయిటమ్ నెంబర్లు కూడా స్పెషలే. లెజండ్ లో హంసా నందిని.. జయజానకి నాయకలో ప్రగ్య జైస్వాల్.. సరైనోడులో అంజలి, ఐటమ్ సాంగ్స్ లో కనిపించి, మెరిపులు మెరిపించారు. ఇప్పుడు అలాంటి మరో అయిటమ్ సాంగ్ ను బోయపాటి రెడీ చేయబోతున్నారు.

రామ్ చరణ్ హీరోగా తయారవుతున్న వినయ విధేయరామ సినిమాలో కూడా మాంచి అయిటమ్ సాంగ్ వుందట. ఈ పాటకు ఎవర్ని తీసుకోవాలన్నదానిపై ఇప్పుడు కసరత్తు ప్రారంభం అయింది. రకరకాల పేర్లు డిస్కషన్ లోకి వస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఒకటి వినిపిస్తోంది.

రాశీఖన్నా అయితే ఊ అంటుందా? అన్న పాయింట్ కూడా డిస్కషన్ లో వున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10 తరువాత ఈ పాట షూటింగ్ వుంటుంది. ఆలోగా ఐటమ్ గర్ల్ ఎవరు అన్నది ఫైనల్ చేసేపనిలో వున్నారు బోయపాటి. వినయ విధేయ షూటింగ్ కొద్దిగా ప్యాచ్ వర్క్, రెండు పాటల షూట్ బకాయి వుంది.

ఇవన్నీ డిసెంబర్ పది తరువాతే. అప్పుడే అయిటమ్ సాంగ్ షూట్ కూడా. అయిటమ్ గర్ల్ ఎవరో బయటకు వస్తే, ఆ సినిమాకు మరింత కిక్ వస్తుంది.

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? … చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్