Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ కు తమిళనాడుతో సంబంధం ఏంటి..?

ఎన్టీఆర్ కు తమిళనాడుతో సంబంధం ఏంటి..?

ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో మేటర్ మొత్తం మనకు తెలిసిందే. కాకపోతే ఆ సినీజీవితాన్ని ఎంత కలర్ ఫుల్ గా చూపించబోతున్నారు, బాలయ్య ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి మాత్రమే ఉంది. దీనికి తగ్గట్టే రకుల్, తమన్న లాంటి తారలతో పాటలు బాగానే పెట్టారు. మరి ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 కూడా అందరూ ఊహించే విధంగానే ఉంటుందా..?

సరిగ్గా ఇక్కడే క్రిష్ ఓ పెద్ద ట్విస్ట్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాలో ఊహించని సన్నివేశాల్ని ప్రేక్షకులు చూస్తారని ఊరిస్తున్నాడు. అలా అని ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఉన్న వెన్నుపోటు ఎపిసోడ్ ను మేకర్స్ చూపించడం లేదు. అంత ధైర్యం కూడా వీళ్లకు లేదు. కాకపోతే తన రాజకీయ జీవితంలో భాగంగా ఎన్టీఆర్ చేసిన కొన్ని ఉద్యమాల్ని మాత్రం పార్ట్-2లో ప్రస్తావించబోతున్నారు.

ప్రస్తుతం వీటికి సంబంధించిన సన్నివేశాల్నే చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా సారధి స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు. చెన్నైకు చెందిన ఓ వీధి సెట్ అది. బోర్డులు, హోర్డింగ్ లు అన్నీ తమిళ్ లో పెట్టారు. టోటల్ సెట్ మొత్తం తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.

ఈ సెట్ లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో ధర్నా, రాస్తారోకోకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రేపోమాపో బాలయ్య కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు. ఎన్టీఆర్ కు చెన్నైలో జరిగే ఓ ఆందోళనతో సంబంధం ఏంటనేది ఇక్కడ హాట్ టాపిక్.

ఇది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నాడు క్రిష్. త్వరలోనే ఈ ఎపిసోడ్ కు సంబంధించి మరో స్టిల్ రిలీజ్ చేస్తానంటున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో తమిళ భాషలో బ్యానర్లు, హోర్డింగ్ లు ఉండే ఈ స్టిల్ కచ్చితంగా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుందంటున్నాడు. 

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?