రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 19 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. టెక్నీషియన్స్ అంతా దాదాపు ఫిక్స్. హీరోయిన్లు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మొన్నటివరకు ఈ లిస్ట్ లో హీరోయిన్ల మధ్య పెద్దయుద్ధమే జరిగింది. ఫైనల్ గా ఇద్దరు మిగిలారు. వాళ్లే కీర్తిసురేష్, కైరా అద్వానీ.
ఈ ప్రాజెక్టులో ముందుగా రాశిఖన్నాను అనుకున్నారు. ఆ తర్వాత కాజల్ లాంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఫైనల్ గా కీర్తిసురేష్, కైరా అద్వానీకి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సినిమాలో రామ్ చరణ్ సరసన కీర్తిసురేష్ ను, ఎన్టీఆర్ సరసన కైరా అద్వానీని హీరోయిన్లుగా తీసుకునే అవకాశాలున్నాయి.
మహానటి సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయింది కీర్తిసురేష్. అటు భరత్ అనే నేను సినిమాతో కైరా అద్వానీ కూడా క్రేజ్ తెచ్చుకుంది. అందుకే వీళ్లిద్దర్నీ తమ ప్రాజెక్టులోకి తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులో నటించేందుకు వీళ్లు ఒప్పుకుంటారా అనేది సందేహం. ఎందుకంటే.. రాజమౌళికి ఒకేసారి బల్క్ లో కాల్షీట్లు ఇవ్వాలి.
ఎన్టీఆర్, రామ్ చరణ్ బల్క్ కాల్షీట్లు ఇచ్చేశారు. ఎందుకంటే సినిమా హిట్ అయితే ఇద్దరికీ పేరొస్తుంది కాబట్టి. కానీ అదే పేరు హీరోయిన్లకు రాదు. అందుకే హీరోయిన్లు ఎవరూ సింగిల్ ప్రాజెక్టులో లాక్ అయిపోవాలని అనుకోరు. అవసరమైతే రోజుకు 2 కాల్షీట్లు ఇచ్చుకుంటారు. తెలుగుతో పాటు తమిళ్ కూడా కవర్ చేయాలనుకుంటారు.
కైరా అద్వానీని పక్కనపెడితే, కీర్తిసురేష్ కు తెలుగు కంటే తమిళ్ లో బాగా క్రేజ్ ఉంది. ఆమె తొలి ప్రాధాన్యం కూడా కోలీవుడ్డే. అక్కడ ఆమె చేతిలో 2 సినిమాలున్నాయి. ఇలాంటి టైమ్ లో రాజమౌళి సినిమాకు ఆమె బల్క్ కాల్షీట్లు కేటాయిస్తుందో లేదో చూడాలి.
టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్