ఈ కొత్త లుక్ ‘పూరి’ కోసమేనా..?

హీరో రామ్ మళ్లీ మారిపోయాడు. గతంలో 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా కోసం రాక్ స్టార్ అవతారంలోకి మారిన ఈ హీరో, ఇప్పుడు మరో అల్ట్రా మేకోవర్ ట్రై చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను…

హీరో రామ్ మళ్లీ మారిపోయాడు. గతంలో 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా కోసం రాక్ స్టార్ అవతారంలోకి మారిన ఈ హీరో, ఇప్పుడు మరో అల్ట్రా మేకోవర్ ట్రై చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.

సడెన్ గా చూస్తే విరాట్ కోహ్లిలా కనిపిస్తున్నాడు రామ్. హెయిర్ స్టయిల్ పూర్తిగా మార్చేశాడు. గడ్డం, మీసకట్టు కూడా కాస్త చెక్కాడు. రామ్ నయా లుక్ ను సోషల్ మీడియాలో అంతా మెచ్చుకుంటూనే, ఇంతకీ ఈ  కొత్త గెటప్ దేనికోసం అనే అనుమానాలు కూడా వ్యక్తంచేశారు.

త్వరలోనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తాడనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఈ సినిమా కోసమే రామ్ ఇలా కొత్తగా ముస్తాబయ్యాడనే టాక్ వినిపిస్తోంది. తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గా చూపించడంలో పూరి జగన్నాథ్ స్టయిలే వేరు. ఏకంగా కల్యాణ్ రామ్ నే సిక్స్ ప్యాక్ లో చూపించిన ఘనత ఈ దర్శకుడిది.

సో.. పూరి జగన్నాధ్ కోసమే రామ్ ఇలా ఈ కొత్త లుక్ లోకి మారాడేమో అనిపిస్తోంది. అదే కనుక నిజమైతే పూరి-రామ్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన త్వరలోనే వస్తుందన్నమాట. హలోగురు ప్రేమకోసమే సినిమా తర్వాత ఈ హీరో ఇప్పటివరకు తన కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు.

టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్‌!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్