రవితేజ కూడా ఆ ఫీట్ సాధించాడట!

కుర్రహీరోలు సిక్స్ ప్యాక్ సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. కానీ రవితేజ లాంటి వయసు మళ్లిన హీరో సిక్స్ ప్యాక్ సాధించాడంటే కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అవును.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో రవితేజ సిక్స్…

కుర్రహీరోలు సిక్స్ ప్యాక్ సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. కానీ రవితేజ లాంటి వయసు మళ్లిన హీరో సిక్స్ ప్యాక్ సాధించాడంటే కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అవును.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో రవితేజ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడట. స్వయంగా ఇలియానా ఈ విషయాన్ని బయటపెట్టింది.

అమర్ అక్బర్ ఆంటోనీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఇలియానా వచ్చింది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నానని, అది కేవలం తన డార్లింగ్ రవితేజ వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చిన ఇలియానా, ఈ సినిమాలో రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించబోతున్నాడని ప్రకటించింది.

అమర్, అక్బర్, ఆంటోనీ సినిమాలో మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు రవితేజ. వీటిలో ఒక డాక్టర్ పాత్ర కూడా ఉంది. అయితే ఈ మూడు పాత్రల్లో ఏ క్యారెక్టర్ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతోందనే విషయంపై క్లారిటీలేదు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేసిన ట్రయిలర్ లో కూడా సిక్స్ ప్యాక్ ప్రస్తావన లేదు.

అసలు ఇలియానా చెప్పినట్టు రవితేజ నిజంగా సిక్స్ ప్యాక్ సాధించాడా అనేది పెద్ద అనుమానం. ఎందుకంటే అతడి బాడీలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. కనీసం అతడు సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడంటూ లీకులు కూడా రాలేదు. నిజంగా రవితేజ సిక్స్ ప్యాక్ సాధిస్తే, అది సినిమాకు పెద్ద ప్రచారాస్త్రంగా మారుతుంది. కానీ ఆ విషయాన్ని యూనిట్ చాలా లైట్ తీసుకుంది.

ఇంతకీ అది సిక్స్ ప్యాకేనా.. లేక మేకప్, కెమెరా జిమ్మిక్కులు, గ్రాఫిక్స్ కలిపి చూపిస్తున్నారా.. వెయిట్ అండ్ సీ..

అమర్ అక్బర్ ఆంటోనీ  ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

మీటూ… సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్