ఆర్..ఆర్..ఆర్..కి మీడియా దూరం

బాహుబలి తర్వాత తెలుగు సినిమా చరిత్రలో మళ్లీ మాట్లాడుకునే సినిమాగా ఆర్ ఆర్ ఆర్ రూపొందబోతోంది. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు టాప్ హీరోలు టాప్ డైరెక్టర్ కలిసి వందల కోట్ల బడ్జెట్ తో…

బాహుబలి తర్వాత తెలుగు సినిమా చరిత్రలో మళ్లీ మాట్లాడుకునే సినిమాగా ఆర్ ఆర్ ఆర్ రూపొందబోతోంది. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు టాప్ హీరోలు టాప్ డైరెక్టర్ కలిసి వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రమిది. దాదాపు గత కొద్దిరోజులుగా మాస్ లాంచ్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు.

కానీ చిత్రంగా అటు మీడియాని కాని ఇటు ఫ్యాన్స్ పబ్లిక్ ని మాస్ లాంచ్ కు ఆహ్వానించడం లేదు. ఇది పూర్తిగా ఓ ప్రైవేటు కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి సినిమా ఓపెనింగ్ లు రెండు రకాలుగా జరుగుతాయి. యూనిట్ సభ్యులు మాత్రమే పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తర్వాత ఫోటోలు మీడియాకు వదులుతారు.

ఇలాంటి వాటికి ముందుగా హడావుడి చేయరు అలాకాకుండా ఫలానా రోజు ఓపెనింగ్ అంటూ హడావుడి చేసేవాళ్లు మాత్రం మీడియాను ఫ్యాన్స్ ని పిలవడం అలవాటు. కానీ మీడియా అంటే పెద్దగా పట్టని రాజమౌళి టీం మాత్రం చిత్రంగా వ్యవహరిస్తోంది.

మాసివ్ ఓపెనింగ్ అంటూ హడావుడి చేస్తూ మీడియాను పబ్లిక్ ను దూరం పెడుతోంది. మీడియాను పిలవమని సలహాలు సూచనలు వచ్చినా రాజమౌళి నో చెప్పినట్లు తెలుస్తోంది. రాజమౌళి అండ్ కోకు మొదటి నుంచి మీడియా అంటే కాస్త చిన్న చూపే.

తాము దూరం పెట్టినా ఎగబడి కవరేజ్ ఇస్తారని వారి ధీమా. బాహుబలి టైంలో కూడా ఇదే వ్యవహారం.

దానయ్య క్యాషియర్ మాత్రమేనా
ఇదిలా ఉంటె మొత్తం ప్రాజెక్టును రాజమౌళి టీం టేకోవర్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం స్టాఫ్ అంతా రాజమౌళికి సంబంధించిన వారే ఇద్దరు హీరోలు ఇద్దరు కోఆర్డినేటర్లను నియమించినట్టు తెలుస్తోంది. అంటే హీరో పర్సనల్ స్టాప్ కూడా ఇక ఈ సినిమా షెడ్యూల్ షూటింగ్ అవసరాలకు దూరమే. అలాగే మొత్తం నిర్మాణ వ్యవహారాలు అన్ని రాజమౌళి బృందమే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి సమయంలో కూడా ప్రొడక్షన్ పనులన్నీ రాజమౌళి కుటుంబ సభ్యులు చూసుకున్నారు. ఇప్పుడు కూడా నిర్మాత దానయ్య కేవలం పెట్టుబడి పెట్టడం తప్ప మిగిలినదంతా రాజమౌళి కుటుంబ సభ్యుల ఆధీనంలోనే జరుగుతుంది.

ఆఖరికి సినిమా మార్కెటింగ్ కూడా రాజమౌళి బృందమే చూస్తుందని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు రాజమౌళి అండ్ టీం అలాగే ఇద్దరు హీరోలు కూడా పారితోషికాలు తీసుకోవడం లేదు. లాభాల్లో వాటానే తీసుకుంటున్నారు. అందువల్ల అన్ని విధాలా టోటల్ ప్రాజెక్టును ఇప్పుడు రాజమౌళి టీం టేకర్.

మీటూ… సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్