ఆమిర్ ఖాన్ తాజా సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్!” డిజాస్టర్ అనిపించుకుంది. తొలిరోజు, తొలి షో అయిన వెంటనే ఈ సినిమాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అసలు ఇది ఆమిర్ ఖాన్ సినిమానేనా.. అని తాము గిల్లి చూసుకున్నామని నెటిజన్లు వాపోయారు. కొన్నేళ్ల నుంచి ఆమిర్ ఖాన్ కు మరీ ఇలాంటి డిజాస్టర్లు లేవు.
సినిమా ఫ్లాప్ కావడం పెద్ద కథ ఏం కాదు.. ఆమిర్ ఖాన్ సినిమా అంటూ ఉండిన భారీ అంచనాలు.. సినిమా మరీ నిరాశ పరచడంతో.. నెటిజన్లు చెలరేగిపోయారు. ట్యూబ్ లైట్, రేస్ త్రీ సినిమాలు కూడా ఇలా తొలి షో పూర్తికాగానే ట్రోల్ ను ఎదుర్కొన్నాయి. అంతేస్థాయి విమర్శలు తప్పలేదు ఆమిర్ ఖాన్ సినిమాకు.
మరి ఆ రేంజ్ లో నిరాశ పరిచినా ఈ సినిమా వసూళ్లకు అయితే లోటు లేదని అంటున్నారు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా వందకోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి షో పూర్తి అయిన వెంటనే ఈ సినిమాకు తీవ్రమైన నెగిటివ్ టాక్ ప్రబలింది.
ఫలితంగా చాలామంది ఈ సినిమా జోలికి వెళ్లడానికే భయపడ్డారు. అయినప్పటికీ మూడు రోజులకు వందకోట్ల రూపాయలు వచ్చాయట. ఇక సండే కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లే ఉండవచ్చు. కానీ.. ఇంతటితో అయిపోదు. దాదాపు మూడువందల కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద సాధించిన వందకోట్ల రూపాయలు ఏ మూలకూ సరిపోవు కదా!
మీటూ… సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్