Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇలియానా, రవితేజ.. ఆన్ స్టేజ్ రొమాన్స్

ఇలియానా, రవితేజ.. ఆన్ స్టేజ్ రొమాన్స్

ఇద్దరు ప్రేమికులు కలిస్తే ఎలా ఉంటుంది. వాళ్లు ఈ లోకాన్నే మరిచిపోయి ప్రవర్తిస్తారు. చుట్టుపక్కల ఏం జరిగినా వాళ్లకు అనవసరం. వాళ్ల లోకం వాళ్లది, వాళ్ల ముచ్చట్లు వాళ్లవి. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇలియానా-రవితేజ కూడా ప్రేక్షకులకు ఇలానే కనిపించారు.

ఫంక్షన్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ఇద్దరూ నవ్వుతూ తుళ్లుతూ ఏవేవో మాట్లాడుకున్నారు. అసలు ఫంక్షన్ కు వచ్చీరావడంతోనే రవితేజను గట్టిగా కౌగిలించుకుంది ఇల్లీ బేబీ. ఆ తర్వాత ఇద్దరూ ముచ్చట్లలో మునిగిపోయారు. ఇదంతా ఒకెత్తయితే స్టేజ్ పై వీళ్లిద్దరి ప్రవర్తన మరో ఎత్తు.

ఏం జరుగుతోంది, ఎవరు మాట్లాడుతున్నారనే విషయంతో సంబంధం లేకుండా ఇద్దరూ స్టేజ్ పైనే మాటల్లో మునిగిపోయారు. ఇలియానా చెవిలో రవితేజ ఏదో చెబుతాడు. అంతే.. ఇద్దరూ ఫక్కున నవ్వుకుంటారు. కాసేపటికి రవితేజ చెవిలో ఇలియానా ఏదో చెబుతుంది.

అంతే మళ్లీ నవ్వులు. శ్రీనువైట్ల, తమన్, నిర్మాతలు.. ఇలా చాలామంది సినిమా గురించి స్టేజ్ పై మాట్లాడుతుంటే.. వీళ్లు మాత్రం ఈ ప్రపంచంలో లేరు. తెగని ముచ్చట్లు, ఎడాపెడా సెల్ఫీలు. ఇక ప్రసంగాల విషయానికొస్తే ఇలియానాను తన డార్లింగ్ అంటూ రవితేజ సంభోదిస్తే.. రవితేజను తన మనసుకు దగ్గరైన వ్యక్తిగా ఇలియానా ఆకాశానికెత్తేసింది.

సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కవుట్ అయిందో మనకు తెలీదు కానీ, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాత్రం వీళ్లను చూసిన జనాలకు చిలకాగోరింక గుర్తొచ్చారు. ఇద్దరి మధ్య ఇంత మంచి బంధం ఉందా అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?