పాయ‌ల్ రాజ్ పుత్.. ఆ ల‌స్టీ ఇమేజ్ మారిపోతుంద‌ట‌!

ఏ ముహూర్తాన ఆర్ఎస్ 100 సినిమాలో న‌టించిందో కానీ.. పాయ‌ల్ రాజ్ పుత్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఏ హీరోయిన్ అయినా అలాంటి సెన్షేష‌న‌ల్ హిట్ కెరీర్ ఆరంభంలోనే కోరుకుంటుంది. ఎంతోమంది హీరోయిన్ల‌కు…

ఏ ముహూర్తాన ఆర్ఎస్ 100 సినిమాలో న‌టించిందో కానీ.. పాయ‌ల్ రాజ్ పుత్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఏ హీరోయిన్ అయినా అలాంటి సెన్షేష‌న‌ల్ హిట్ కెరీర్ ఆరంభంలోనే కోరుకుంటుంది. ఎంతోమంది హీరోయిన్ల‌కు క‌ల‌ల పంట లాంటి హిట్ కొట్టింది పాయ‌ల్ రాజ్ పుత్. అయితే ఆ త‌ర్వాతే క‌థ మార్పు లేకుండా పోయింది పాపం!

ఆమె చేత‌ మ‌రీ లేకి, దిగువ స్థాయి పాత్ర‌లు చేయించ‌డానికి కొంత‌మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు రెడీ అయిపోయారు. అలాంటి వాటిల్లో ఒక సినిమా తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఒక‌వైపు వెంకీమామ సినిమాలో వెంక‌టేష్ స‌ర‌స‌న‌, డిస్కో రాజాలో ర‌వితేజ‌తో అవ‌కాశం పొందినా.. ఆమె చేసిన ఒక థ‌ర్డ్ గ్రేడ్ సినిమా మాత్రం ఆమెకు ఒక మ‌చ్చ‌గా మారిపోయింది. పాయ‌ల్ అంటే ల‌స్ట్ తో కూడుకున్న పాత్ర‌ల‌కే అనే ఇమేజ్ ఒక‌టి వ‌చ్చేసింది.

ఇదే స‌మ‌యంలో ఆమె పెద్ద హీరోల స‌ర‌సన న‌టించిన సినిమాలు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకురాలేక‌పోయాయి. ఈ క్ర‌మంలో త‌న ఇమేజ్ ను మార్చుకోవ‌డానికి పూనుకుంద‌ట పాయ‌ల్. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న త‌దుప‌రి సినిమాలో పూర్తి విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ట‌. ఒక ఐపీఎస్ రోల్  లో ఆమె క‌నిపిస్తుంద‌ట‌.

ఈ సినిమాతో పాయ‌ల్ ఇమేజ్ మారిపోతుంద‌ని దాని రూప‌క‌ర్త‌లు విశ్వాసంగా చెబుతున్నారు. పాయ‌ల్ అంటే ఇక నుంచి కొత్త నిర్వ‌చ‌నం అందుతుంద‌ని అంటున్నారు. ఇమేజ్ సంగ‌తెలా ఉన్నా.. ప్ర‌స్తుతానికి పాయ‌ల్ కు ఒక హిట్ అయితే అవ‌స‌రం! 

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం