ఆచార్య సాంగ్ అనుభవం నాకు చాలా కొత్త

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజైంది. లాహే..లాహే అనే లిరిక్స్ తో సాగే ఆ పాటకు మణిశర్మ సంగీతం అందించాడు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. అయితే ఈ…

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజైంది. లాహే..లాహే అనే లిరిక్స్ తో సాగే ఆ పాటకు మణిశర్మ సంగీతం అందించాడు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. అయితే ఈ పాట కంపోజిషన్ తనకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్ని అందించిందంటున్నాడు మణిశర్మ.

సాధారణంగా పాట కంపోజిషన్ టైమ్ లో దర్శకుడు ఉన్నా లేకున్నా.. లిరిక్ రైటర్ కచ్చితంగా ఉండాల్సిందే. దశాబ్దాలుగా ఇలానే పనిచేస్తూ వస్తున్నాడు మణిశర్మ. అయితే ''లాహే లాహే'' సాంగ్ కంపోజిషన్ టైమ్ లో మాత్రం శాస్త్రి లేకుండానే పనిచేశానంటున్నాడు.

ఈ పాట కంపోజ్ చేసే టైమ్ లో లాక్ డౌన్ ఉందట. దీంతో తను రాకుండా, సాహిత్యాన్ని మాత్రం పంపించారట రామ్ జో. అలా ఊహించని విధంగా మనిషి బదులు, కాగితాలు వచ్చేసరికి కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త కొత్తదనం అనిపించిందంటున్నారు మణిశర్మ. 

అలా పాట రచయిత లేకుండానే ఆ పాట కంపోజ్ చేశానన్నారు. తొలిసారి దర్శకుడు కొరటాలతో వర్క్ చేసిన ఈ సంగీత దర్శకుడు.. గుణశేఖర్, పూరి లాంటి దర్శకులతో వర్క్ చేసినప్పుడు ఎంత కంఫర్ట్ గా ఉంటుందో, కొరటాలతో కూడా అంతే సౌకర్యంగా ఉందని చెబుతున్నాడు.

ఇక శాకుంతలం సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు ఇలాంటి సినిమాకు తను పనిచేయలేదని.. ఓ కొత్తరకం సంగీతాన్ని శాకుంతలంలో వింటారని చెబుతున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో పూర్తిగా ఆర్గానిక్ మ్యూజిక్ ఉంటుందని, పాత వాయిద్యాలు వాడతానని అన్నారు.