కొత్త కొత్త నిర్మాణ సంస్థలు డబ్బు కన్నా, హఢావుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కాకలు తీరి, అనుభవం పండించుకుని, ఎంత పెద్ద సంఘటన అయినా మినిమమ్ ఎగ్జయిట్ మెంట్ కూడా ప్రదర్శించకుండా, స్థిత ప్రజ్ఞత కనబర్చే సంస్థలు ఒకటి రెండు మాత్రమే వుంటాయి ఇండస్ట్రీలో. ఇవి దేనికీ కూడా అంత చరుగ్గా స్పందించవు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.
ఓ పెద్ద దర్శకుడి బర్త్ డే వచ్చింది. ఈసారి కాస్త ప్రకటనలు హడావుడి వుంటుందని ముందే తెలిసిపోయింది. ఎందకుంటే ఈ మధ్యే కాస్త హిట్ కొట్టి మళ్లీ కెరీర్ కు ఊపువచ్చింది. దాన్ని నిలబెట్టాలి కాబట్టి, ఆయన సన్నిహితులు భారీగా ప్రకటనలు ఇచ్చారు.
ఇదే టైమ్ లో ఆయనతో సినిమా చేయాలనుకుంటున్న ఓ సంస్థ కూడా పావుపేజీ ప్రకటన ఇవ్వబోతోందని ముందుగానే వార్త బయటకు వచ్చింది. ఆ విధంగా ఆయనతో తాము సినిమా చేయబోతున్నట్లు చెప్పినట్లు కూడా అవుతుందని ఆలోచన చేసినట్లు వినిపించింది.
కానీ ప్రకటన రాలేదు. అదే గమ్మత్తు. తనను నమ్ముకున్న బ్యానర్ కే సినిమా చేయాలని దర్శకుడు పట్టు పట్టడంతో, ఇంక తామెందుకు ప్రకటన ఇవ్వడం అన్న ఆలోచన ఒకటి. ఇదికాక, పావుపేజీ ప్రకటన అంటే లక్షన్నర. ఏదీలేని దానికి లక్షన్నర అవసరమా? ఓ వేయి రూపాయలు పెట్టి బొకే ఇస్తే అయిపోతుందిగా? అన్న ఆలోచన మరోవైపు అన్నది అసలు సిసలు గ్యాసిప్.
కానీ ఆ డైరక్టర్ నే నమ్ముకున్న సంస్థ మాత్రం అయిదులక్షలు ఖర్చుపెట్టి ప్రకటన ఇవ్వడం విశేషం. ఇదే ఒకవేళ ఆ డైరక్టర్ బ్యానర్ విషయంలో రాజీపడి వుంటే ప్రకటనలు వేరుగా వుండేవేమో?
ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్