మహేష్ బాబు కొత్త నిర్ణయం?

మహేష్ బాబు కేవలం హీరోగానే కాదు. రకరకాలుగా వ్యాపకాలు, వ్యాపారాలు చేస్తుంటారు. యాడ్ ఫిల్మ్ లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు, కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ ఫ్లెక్స్ ల్లో పెట్టుబడులు ఇలా చాలా.. అంటే…

మహేష్ బాబు కేవలం హీరోగానే కాదు. రకరకాలుగా వ్యాపకాలు, వ్యాపారాలు చేస్తుంటారు. యాడ్ ఫిల్మ్ లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు, కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ ఫ్లెక్స్ ల్లో పెట్టుబడులు ఇలా చాలా.. అంటే చాలా. దీనికి తోడు తన సినిమాల నిర్మాణాల్లో కూడా పాలు పంచుకునేందుకు ఎంబి అనే బ్యానర్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ బ్యానర్ ను కేవలం తన సినిమాలకే పరిమితం చేయాలని అనుకోవడం లేదట. ఇకపై చిన్న సినిమాలు, డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని ఆలోచిస్తున్నారట. మహేష్ బాబు బ్యానర్ వ్యవహారాలను ఆయన భార్య నమ్రత చూస్తారన్న సంగతి తెలిసిందే.

ఆమె ఇప్పుడు సరైన కథలు, కాస్త ప్రామిసింగ్ గా వుండే చిన్న డైరక్టర్ల కోసం చూస్తున్నారు. రెండు, మూడు కోట్ల రేంజ్ లో మంచి సినిమాలు తీసి పెట్టగల సత్తా వున్న దర్శకులు, కథకులు ఎవరన్నా వున్నారా అన్న ఆచూకీ తీస్తున్నారు. ఆర్ఎక్స్ 100, యుటర్న్, చిలసౌ వంటి సినిమాలు ఈ మధ్య మంచి పేరు తెచ్చుకున్నాయి.

గీతా, యువి, మైత్రీ, ఇలాంటి పెద్ద సంస్థలు కూడా ఇప్పుడు చిన్న మీడియం సినిమాల మీద దృష్టి పెట్టాయి. అందువల్ల ఇప్పుడు ఇధే దోవలో ఎంబి సంస్థ మీద కూడా సినిమాలు తీయాలన్నది నమ్రత ఆలోచగా తెలుస్తోంది. పైగా లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు అయిన ఏషియన్, దిల్ రాజు వంటి వారితో మంచి సంబంధాలు వున్నాయి.

అందువల్ల నిర్మాణం అన్నది కాస్త మేనేజ్ చేయగలిగితే, మహేష్ కు ఈ పని కూడా కలిసివచ్చేదే. పైగా అన్నీ చకచకా మేనేజ్ చేయడానికి నమ్రత వుండనే వున్నారు. ఆమె సమర్థత ఇండస్ట్రీ జనాలకు తెలిసిందే.