అసంతృప్తులకు అమ్ముడుపోయారనే ముద్ర

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీల్లో అంతర్గతంగా కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది. పార్టీని ఆస్తిలాగా.. తమను తాము చక్రవర్తి లాగా భావించే నాయకుల విషయంలోనే.. ఆ పార్టీ వ్యవహారాలు కూడా నిరంకుశ పాలనకు నిదర్శనాలుగానే ఉంటాయి. ఇప్పుడు…

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీల్లో అంతర్గతంగా కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది. పార్టీని ఆస్తిలాగా.. తమను తాము చక్రవర్తి లాగా భావించే నాయకుల విషయంలోనే.. ఆ పార్టీ వ్యవహారాలు కూడా నిరంకుశ పాలనకు నిదర్శనాలుగానే ఉంటాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ జనసేన వ్యవహారాల గురించి కనబరుస్తున్న శ్రద్ధ, తీసుకుంటున్న చొరవ గమనిస్తే ఇదే అనిపిస్తోంది.

పార్టీ అన్న తరువాత నాయకుల్లో కొందరి మీద కార్యకర్తలకు, అభిమానులకు భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. పవన్ ఎవరిని నెత్తిన  పెట్టుకుంటే వారందరినీ.. యావత్ జనసైనికులూ నెత్తినపెట్టుకోవాలనే నిబంధన ఎక్కడా ఉండదు. అత్యంత ఫ్యూడల్ గా కనిపించే పార్టీలు కూడా.. సాక్షాత్తూ అధినేత మీద విమర్శలు కురిపిస్తే తప్ప.. ఇతర నాయకుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తితో స్పందించినప్పుడు.. వాటిని అర్థం చేసుకోకుండా.. వారి మీద భిన్నమైన ముద్ర వేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. వారందరూ జనసైనికులని చెప్పుంటున్న అమ్ముడుపోయిన వ్యక్తులని.. వారిని అవమానించేలా పవన్ మాట్లాడుతున్నారు.

ఈ మేరకు జనసేన పార్టీ న్యాయవిభాగం కోఆర్డినేటర్ ఇవన సాంబశివప్రతాప్ ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో పార్టీలో ఉండి, ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన కొందరు వ్యక్తులు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నట్లుగా చెప్పుకుంటూ.. పార్టీకి చేటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ విధానాలను తప్పుపడుతూ, ముఖ్యనాయకులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనేది ఆయన ఆవేదన.  ఇలా లైవ్ వీడియోలు పెడుతూ పోస్టులు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం.. లీగల్ నోటీసులు జారీచేసి తర్వాత.. చర్యచ తీసుకుంటాం అని హెచ్చరిస్తున్నారు.

తమాషా ఏంటంటే.. అసభ్యమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టనంత వరకు, సోషల్ మీడియాలో భావప్రకటన చేసే వారిపై కేసులు పెట్టడానికి లీగల్ నోటీసులు ఇవ్వడానికి ఏ చట్టం ఉపకరిస్తుందో ఆ పెద్దలు చెప్పాలి. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అనిపిస్తే మహా అయితూ వారిని సస్పెండ్ చేయగలరు.. అంతే తప్ప.. ఇంకేం చేయగలరు? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. కొందరు భజంత్రీలకు పెద్దపీట వేస్తూ.. భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చే అభిమానుల్ని దూరం చేసుకునే పెడపోకడలు జనసేనలో కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది