ఇదిగో కలిసారు అంటే అదిగో సినిమా అంటూ వుండడం కామన్. కళ్యాణ్ రామ్-మైత్రీ సినిమా అంటూ ఓ వార్త ఇలాగే పుట్టింది. నిజానికి ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి. మల్లిడి వేణు డైరక్షన్ లో స్వంత బ్యానర్ మీద ఒకటి. విఐ ఆనంద్ డైరక్షన్ లో మహేష్ కోనేరు నిర్మించేది మరోటి. గుహాన్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించే సినిమా ఇంకోటి.
ఇలాంటి టైమ్ లో మైత్రీ మూవీ మేకర్లు కూడా కళ్యాణ్ రామ్ ను కలిసారు. ఓ లైన్ వుంది అని చెప్పారు. కళ్యాణ్ రామ్ లైన్ మాత్రం విన్నారు. ఆలోచిద్దాం అన్నారు. ఇంకా అడ్వాన్స్ లాంటి వ్యవహారం కూడా ఏమీ లేదు. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, ఈ లైన్, ఈ ప్రాజెక్టు జరిగే వ్యవహారం కాదని.
ఎందుకంటే ఈ కథలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ యాక్షన్ చేయాలి. అంటే ముగ్గురు కళ్యాణ్ రామ్ లు అన్నమాట. పైగా బోలెడు యాక్షన్ వగైరా వుంది. అందువల్ల ఇది కళ్యాణ్ రామ్ మీద వర్కవుట్ అవుతుందా? అన్నది అనుమానం.