కరోనా కేంద్రంగా మారిన శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా పట్టణంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఇవాళ్టి నుంచి పట్టణంలో కఠిన ఆంక్షలు ప్రవేశపెట్టారు. ఇవాళ్టి నుంచి షాపులన్నీ మధ్యాహ్నం 2 గంటల…

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా పట్టణంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఇవాళ్టి నుంచి పట్టణంలో కఠిన ఆంక్షలు ప్రవేశపెట్టారు. ఇవాళ్టి నుంచి షాపులన్నీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత మూసేస్తారు. ఇక రాత్రి కర్ఫ్యూ కూడా యథావిథిగా కొనసాగుతుంది.

ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 30శాతం జనాభాకు కరోనా సోకింది. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా సిటీలోని అన్ని ఏరియాల్లో కరోనా కేసులున్నాయి. దీంతో శ్రీకాకుళం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్ నివాస్.

ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు పట్టణంలో కఠిన ఆంక్షలు అమలౌతాయని ప్రకటించారు కలెక్టర్. అత్యవసర సర్వీసులు మాత్రం ఎప్పట్లానే పనిచేస్తాయని తెలిపారు. పట్టణంలోకి బస్సుల రాకపోకల్ని 50శాతానికి కుదించారు. దాదాపు ఇవే తరహా ఆంక్షలు ఇవాళ్టి నుంచి తిరుపతిలో కూడా అమల్లోకి రాబోతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో అత్యథికంగా కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. ప్రస్తుతం జిల్లాలో 62వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, 379 మంది మరణించారు. ప్రస్తుతం జిల్లాలో 12వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.