పెళ్లంటే వ‌ద్దే వ‌ద్ద‌న్న‌ ఆ హీరోయిన్‌కు… ఇప్పుడెందుకు కావాలంటే?

కంగ‌నా ర‌నౌత్‌…బాలీవుడ్ హీరోయిన్ అని మాత్ర‌మే చెబితే అసంపూర్తిగా ఉంటుంది. సినిమాల‌తో పాటు వివాదాల్లో కూడా స‌క్సెస్ ఫుల్‌గా రాణిస్తున్న హీరోయిన్‌. బాలీవుడ్ బెస్ట్ హీరోయిన్‌ల‌లో ఆమె పేరు వినిపిస్తోందంటే….కంగ‌నా ఎంచుకునే పాత్ర‌లు ఎంత…

కంగ‌నా ర‌నౌత్‌…బాలీవుడ్ హీరోయిన్ అని మాత్ర‌మే చెబితే అసంపూర్తిగా ఉంటుంది. సినిమాల‌తో పాటు వివాదాల్లో కూడా స‌క్సెస్ ఫుల్‌గా రాణిస్తున్న హీరోయిన్‌. బాలీవుడ్ బెస్ట్ హీరోయిన్‌ల‌లో ఆమె పేరు వినిపిస్తోందంటే….కంగ‌నా ఎంచుకునే పాత్ర‌లు ఎంత ఛాలెంజింగ్‌గా ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు.

‘ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో కంగనాకి కోపం ఎక్కువ అని అంటున్నారు నిజమేనా?’ అనే ప్రశ్న వేయ‌గా…. ‘కోపం ఒక్కటే కాదు, నాకు తిక్క కూడా ఎక్కువే’ అని ఏ మాత్రం త‌డుముకోకుండా ఆమె స‌మాధాన‌మిచ్చారు. ఇంత‌కూ ఆ అమ్మ‌డు త‌న ‘తిక్క‌’మాట‌ల్లోని లెక్కేంటో….మిగిలిన విశేషాలేంటో తెలుసుకుందాం.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు త‌న‌కు పెళ్లిమీద స‌ద‌భిప్రాయం లేద‌ని, అందుకే జీవితంలో ఆ పని మాత్రం చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ది నిజ‌మేన‌ని కంగ‌నా తెలిపారు. కానీ కొన్ని సంఘ‌ట‌ను, కొంత మంది వ్య‌క్తుల ప్ర‌భావం వ‌ల్ల పెళ్లిపై త‌న అభిప్రాయం మార్చుకున్న‌ట్టు ఆమె వెల్ల‌డించారు.  ‘పంగా’ దర్శకురాలు అశ్వినీ అయ్యర్‌, ఆమె భర్త నితేష్‌ తివారి జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుందన్నారు. వారిని చూశాక‌ పెళ్లిపై త‌న‌ అభిప్రాయం మారింద‌ని ఆమె చెప్పారు. త్వరలో పెళ్ళి చేసుకోవా లనుకుంటున్న‌ట్టు ఆమె చెప్పారు.
 
దర్శకత్వం అంటేనే త‌న‌కిష్టమ‌ని ఆమె తెలిపారు. ‘డైరెక్టర్‌కి ఆల్‌ రౌండ్‌ లీడర్‌ షిప్‌ లక్షణాలు కావాలి. అది చాలా ఛాలెంజింగ్‌ రోల్‌. ఐ లవ్‌ డైరెక్టర్‌ జాబ్‌. అవి నాలో ఉన్నాయనే అనుకుంటున్నా’ అని ఆమె అన్నారు.

త‌న‌కు కోపం ఒక్కటే కాదు, తిక్క కూడా ఎక్కువంటారామె.  ఆ రెండింటికీ ఓ లెక్క ఉంద‌న్నారు. త‌న‌కు పట్టరాని కోపం వచ్చినా అది నిర్మాణాత్మకంగా ఉంటుంద‌ని చెప్పారు. తానెప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసినా అది త‌న‌ మంచికే దారితీసింద‌న్నారు. త‌న‌లో చిన్న పిల్లల మనస్తత్వం ఉంద‌ని, అది ఎవరి లాజిక్‌కూ అందదని ఆమె చెప్పుకుపోయారు.

తనని కాపీ కొట్టాను అందుకే ఇంత పెద్ద హిట్ అయ్యింది

బాధపడుతున్న వంశీ పైడిపల్లి