కాటికెళ్ళినా వదలని కరోనా కష్టాలు

విశాఖలో కరోనా రెండవ దశ మరణ మృదంగమే మోగిస్తోంది. కేసులు రోజుకు వేయి దాకా నమోదు అవుతున్నాయి. అదే సమయంలో మరణాలు కూడా రోజుకు పదికి చేరువ అవుతున్నాయి.  Advertisement కరోనా ప్రభావం సంగతేంటి…

విశాఖలో కరోనా రెండవ దశ మరణ మృదంగమే మోగిస్తోంది. కేసులు రోజుకు వేయి దాకా నమోదు అవుతున్నాయి. అదే సమయంలో మరణాలు కూడా రోజుకు పదికి చేరువ అవుతున్నాయి. 

కరోనా ప్రభావం సంగతేంటి అన్నది తెలుసుకోవాలంటే  శ్మశాన వాటిక వద్దకు వెళ్తే చాలు. అక్కడ లోడెత్తిపోతున్న శవాల గుట్టలు కరోనా సృష్టించిన మారణ హోమం గురించి చెబుతాయి.

విశాఖలో అతి పెద్దదైన చావుల మదుం శ్మశాన వాటికలో శవాలు కాలడానికి  అంబులెన్సుల్లో వెయిట్ చేస్తున్నాయి. కాల్చడానికి అంగుళం జాగా లేదు, కట్టెలు కూడా పట్టు దొరకడం లేదు. దాంతో కరోనా రోగులకు మరణించినా యాతన తప్పడంలేదన్న మాట. 

విశాఖ వంటి మహా నగరంలో కరోనా పుణ్యమాని కాల్చే కట్టెలకు కూడా యమ డిమాండ్ వచ్చి పడింది. దాంతో పట్టు కట్టెలు అయిదు వేల నుంచి పది వేలకు ధర పలుకుతున్నాయంటే కరోనా కిరాతకం గురించి వేరే చెప్పాలా.

ఇదిలా ఉంటే మామూలుగానే రోజుకు చావులమదుం కి పది నుంచి ఇరవై దాకా శవాలు వస్తాయి. కరోనా సెకండ్ వేవ్ తో ఆ సంఖ్య రెట్టింపు కావడంతో శవాల దిబ్బగా ఈ ప్రాంతం మారుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

మరో వైపు చూస్తే కరోనా శవాల దహనానికి అధిక రుసుం వసూలు చేసే వారి మీద కఠిన చర్యలకు జీవీఎంసీ అధికారులు ఉపక్రమించారు.