దిల్ రాజుకు పవన్ ఫిదా?

నిర్మాత దిల్ రాజు మేకింగ్ స్టయిల్ కో, లేదా ఆయన ఇచ్చిన 65 కోట్ల రెమ్యూనిరేషన్ కో మొత్తానికి ఏదో ఒకదానికి పవర్ స్టార్ పవన్ ఫిదా అయిపోయారు. మళ్లీ మరో సినిమా చేద్దామని…

నిర్మాత దిల్ రాజు మేకింగ్ స్టయిల్ కో, లేదా ఆయన ఇచ్చిన 65 కోట్ల రెమ్యూనిరేషన్ కో మొత్తానికి ఏదో ఒకదానికి పవర్ స్టార్ పవన్ ఫిదా అయిపోయారు. మళ్లీ మరో సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. 

ఈ మేరకు ఇప్పటికే గ్యాసిప్ లు వచ్చేసాయి. అయితే దిల్ రాజు సన్నిహిత వర్గాల బోగట్టా ఇంకా అదనంగా వుంది. మంచి కథ, డైరక్టర్ ను తెచ్చుకుంటే ఔట్ ఆఫ్ టర్న్ సినిమా చేస్తానని దిల్ రాజు కు పవన్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన సినిమా స్పెషల్ షో లు క్యాన్సిల్ కావడం, రేట్లు మారడం వంటి వాటి వల్ల దిల్ రాజు కు రావాల్సిన మేరకు రెవెన్యూ రాలేదు. అందువల్ల దానికి బదులుగా అన్నట్లు వుంటుంది. 

దిల్ రాజు చాలా పక్కాగా ప్లాన్డ్ గా సినిమా చేసేస్తారు కాబట్టి త్వరగా మరో సినిమా చేసినట్లు వుంటుంది అని పవన్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఆఫర్ ఇచ్చినట్లు బోగట్టా.

వకీల్ సాబ్ అందించిన దర్శకుడు వేణు శ్రీరామ్ నే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ లైన్ ఒకటి పవన్ కోసం తయారుచేసి వుంచినట్లు తెలుస్తోంది. దీన్ని పవన్ కు వినిపించే ఐడియాలో వున్నారు. అలాగే దిల్ రాజు దగ్గర వున్న ఒకరిద్దరు క్రేజీ డైరక్టర్ల తో కూడా పవన్ కు లైన్ చెప్పించే ఆలోచన చేస్తున్నారు.

అంతా బాగానే వుంది. కానీ పవన్ అవుట్ ఆఫ్ టర్న్ దిల్ రాజుకు మరో సినిమా ఇస్తే, ఎవరి సినిమా వెనక్కు వెళ్తుందో?