విశాఖకు గర్వకారణంగా…వందేళ్ళకు చేరువగా …

విశాఖ ఇంతలా విఖ్యాతి గడించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో విద్యారంగం కూడా అతి ముఖ్యమైనది. విశాఖకు దాదాపుగా వందేళ్ళ క్రితమే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఆంధ్రా యూనివర్శిటీ ఉంది. నాడు పట్టి పట్టి మరీ…

విశాఖ ఇంతలా విఖ్యాతి గడించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో విద్యారంగం కూడా అతి ముఖ్యమైనది. విశాఖకు దాదాపుగా వందేళ్ళ క్రితమే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఆంధ్రా యూనివర్శిటీ ఉంది. నాడు పట్టి పట్టి మరీ విశాఖలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వెనక ఎందరో ప్రముఖుల కృషి ఉంది.

ఇదిలా ఉంటే కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక ఉప కులపతిగా ఏయూకు చేసిన సేవలు ప్రశంశనీయం. 1926 ఏప్రిల్ 26న ఏర్పాటు అయిన ఏయూ 95వ మైలు రాయిని దాటింది. మరో అయిదేళ్ళలో వందేళ్ళ వర్శిటీగా చరిత్రకెక్కనుంది.

ఇక్కడ ఉప కులపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ తరువాత కాలంలో దేశానికి ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఇక్కడ న్యాయ విద్యను అభ్యసించిన ఎం వెంకయ్యనాయుడు ఈ రోజు ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఇక్కడే చదివిన జీఎంసీ బాలయోగి లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. 

మొత్తానికి చూసుకుంటే ఎందరెందరో ప్రముఖులను తయారు చేసి వారి ప్రగతిలో తనను తాను చూసుకుంటున్న ఏయూ వందేళ్ళ ప్రస్థానంలో మరిన్ని విజయాలను నమోదు చేయాలని అంతా కోరుకుంటున్నారు.