జగన్ పై మోడీ మరింత ఆధారపడతారా?

కేంద్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాజ్యసభలో 55 స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికలు పూర్తయ్యేసరికి రాజ్యసభలో భాజపా పరిస్థితి ప్రస్తుతం ఉన్నదానికంటె ఘోరంగా తయారవుతుంది. అదే…

కేంద్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాజ్యసభలో 55 స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికలు పూర్తయ్యేసరికి రాజ్యసభలో భాజపా పరిస్థితి ప్రస్తుతం ఉన్నదానికంటె ఘోరంగా తయారవుతుంది. అదే సమయంలో  వైఎస్సార్ కాంగ్రెస్ బలం బాగా పెరుగుతుంది. సంవత్సరాంతానికి పరిస్థితి ఎలా తయారవుతుందంటే.. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్డీయే లో కలుపుకుంటే చాలు… రాజ్యసభలో అధికార కూటమి సాధారణ మెజారిటీని కలిగి ఉండే పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో జగన్ మీద మోడీ సర్కారు డిపెండబిలిటీ మరింతగా పెరగనుంది.

రాజ్యసభలో 55 ఎంపీస్థానాలకు ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 23 భాజపా స్థానాలే. ఈ 23 స్థానాలను భాజపా తిరిగి నిలబెట్టుకునే పరిస్థితి లేదు. 2-3 సీట్లు కోల్పోవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ బలం పెరుగుతుంది. ఇతర పక్షాల బలాలు కూడా పెరుగుతాయి. తెరాస, వైకాపా బలం కూడా పెరుగుతుంది.

తెరాస బలం పెరిగేది రెండు స్థానాలే. అయినా వారి బలం 8కి చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 4 సీట్లకు ఎన్నికలు జరగనుండగా, అన్నీ వైకాపా వశం అవుతాయి. ఆ పార్టీ బలం 6కు పెరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న బలాబలాల ప్రకారమే.. అధికార కూటమి సింపుల్ మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఉంది. రాజ్యసభలో కీలక బిల్లులు ప్రవేశ పెట్టిన ప్రతిసారీ.. మద్దతు కూడగట్టుకోవడానికి కిందామీద పడుతోంది. చిన్న పార్టీల సాయం వారికి అనివార్యం అవుతోంది.

ఇప్పుడు జగన్ పార్టీకి బలం మరింత పెరగనుండడంతో.. సహజంగానే జగన్ మీద మోడీ డిపెండబిలిటీ కూడా పెరుగుతుంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలోనే.. ఎన్డీయేలో వైకాపా చేరుతుందనే పుకార్లు కూడా ఇటీవలి కాలంలో బాగా వినిపించాయి. రెండు పార్టీల నాయకులు ఆ పుకార్లను అప్పటికి కొట్టి పారేసినప్పటికీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు.

మోడీ సర్కారు చికాకుల్లేకుండా.. సాఫీగా పాలన సాగించడానికి వారికి జగన్ అవసరం రాబోయే ఏడాది రోజుల్లో చాలా ఉంటుందనేది సత్యం. అయితే.. అందుకు సంబంధించి.. ఇరు పార్టీల మధ్య బాంధవ్యాలు ఎలా మార్పులు చెందుతాయనేదిత మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

తనని కాపీ కొట్టాను అందుకే ఇంత పెద్ద హిట్ అయ్యింది