ఉగాదితో సర్కారువారి పాట సెకెండ్ షెడ్యూల్ షురూ చేశాడు మహేష్. కరోనా కేసులు పెరుగుతున్న టైమ్ లో ఈ షూటింగ్ అవసరమా అని అంతా అనుమానపడ్డారు. ఆ అనుమానాలే నిజమయ్యాయి. సర్కారువారి పాట లొకేషన్ లో కరోనా కేసులు బయటపడ్డాయి.
దీంతో ఉన్నఫలంగా ప్యాకప్ చెప్పేశారు. అంతా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మహేష్ ఆరోగ్యంపై అతడి అభిమానులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ఆందోళనల్ని రెట్టింపు చేస్తూ 3 రోజుల నుంచి మహేష్ ఎవ్వరికీ కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ లో టెన్షన్ ఇంకాస్త ఎక్కువైంది.
ఎట్టకేలకు మహేష్ నుంచి ఓ ఫొటో వచ్చింది. కూతురు సితార, పెంపుడు కుక్క ప్లూటోతో సరదాగా గడుపుతున్న స్టిల్ ను నమ్రత రిలీజ్ చేసింది. ఈరోజు ఉదయం రిలీజైన ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అటు ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చిన్న షార్ట్, టీషర్ట్ వేసుకున్న మహేష్ ఎప్పట్లానే కూల్ గా కనిపించాడు.
ఇక సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారువారి పాట సినిమాకు సంబంధించి తదుపరి షెడ్యూల్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదు.