ఇలియానాకు అమర ప్రేమికుడు ఈ హీరో

ప్రతి హీరోకు చిన్నప్పుడు ఓ క్రష్ ఉంటుంది. పెద్దయ్యేకొద్దీ అది పోతుంది, ఆ స్థానాన్ని మరో అమ్మాయి భర్తీ చేస్తుంది. ఇక స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత అభిరుచులు మరింత మారిపోతుంటాయి. కానీ నటుడు…

ప్రతి హీరోకు చిన్నప్పుడు ఓ క్రష్ ఉంటుంది. పెద్దయ్యేకొద్దీ అది పోతుంది, ఆ స్థానాన్ని మరో అమ్మాయి భర్తీ చేస్తుంది. ఇక స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత అభిరుచులు మరింత మారిపోతుంటాయి. కానీ నటుడు విశ్వక్ సేన్ మాత్రం ఈ విషయంలో రివర్స్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తను అమర ప్రేమికుడినని చెబుతున్నాడు.

చిన్నప్పట్నుంచి విశ్వక్ కు ఇలియానా అంటే పిచ్చి. ఆమె సినిమాలు, పోస్టర్లు, ఫొటోషూట్లు ఏవి కనిపించినా మిస్సయ్యేవాడు కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత కూడా తన మనసు మారలేదంటున్నాడు ఈ హీరో. చిన్నప్పట్నుంచి ఇప్పటివరకు తనకు ఇలియానా అంటేనే ఇష్టమని చెబుతున్నాడు.

ఇక తన సినిమాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. తను కప్పెళ రీమేక్ చేస్తున్నానని చాలామంది అనుకుంటున్నారని, కానీ అందులో తను నటించడం లేదని స్పష్టంచేశాడు. ఓ మై కడవులే రీమేక్ మాత్రం చేస్తున్నానని తెలిపిన విశ్వక్.. పాగల్ ట్రయిలర్ కోసం అందర్లానే తను కూడా ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

బయటకు వెళ్దామంటే అమ్మ కొడుతోందని, అందుకే ఇంట్లోనే ఉంటున్నానని.. ఈ కరోనా టైమ్ లో తనలానే అందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాడు విశ్వక్.