కాబోయే భ‌ర్త‌తో ఏకాంతంగా బ్యూటీ…

వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప‌దినెల‌లు. అయితే జీవిత కాలం అత‌నితో అనుబంధం ఉన్న ఫీలింగ్ … ఈ ప‌ది నెల‌ల ప్రేమ క‌లిగిస్తోం ద‌ని ఆ బ్యూటీ మురిసిపోతోంది. ప్ర‌స్తుతం త‌న‌కు కాబోయే భ‌ర్త‌తో…

వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప‌దినెల‌లు. అయితే జీవిత కాలం అత‌నితో అనుబంధం ఉన్న ఫీలింగ్ … ఈ ప‌ది నెల‌ల ప్రేమ క‌లిగిస్తోం ద‌ని ఆ బ్యూటీ మురిసిపోతోంది. ప్ర‌స్తుతం త‌న‌కు కాబోయే భ‌ర్త‌తో ఆ బ్యూటీ ఏకాంతంగా గ‌డుపుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోల క‌థాక‌మామీషూ తెలుసుకుందాం.

కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంలో మహాలక్ష్మిగా న‌టించి, మెప్పించిన గ్లామ‌ర్ బ్యూటీ మెహ‌రీన్ త‌న కాబోయే భ‌ర్త‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. 2019లో ‘ఎఫ్‌-2’లో హనీగా పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందారు. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్‌గా ప్ర‌స్తుతం ఎఫ్ 3 చేస్తోంది. 

హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో పంజాబీ బ్యూటీ మెహ‌రీన్ ప‌ది నెల‌ల క్రితం ప్రేమ‌లో ప‌డింది. గత ఏడాది లాక్‌డౌన్ వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ బంధానికి కార‌ణ‌మైంది. 

లాక్‌డౌన్‌లో వారి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త సాన్నిహి త్యాన్ని పెంచింది. దీంతో భ‌వ్య బ‌ర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం అండమాన్‌ వెళ్లారు. స్కూబా డైవింగ్‌ చేస్తున్న సమయంలో ‘విల్‌ యూ మ్యారీ మీ’ అనే కార్డుతో భవ్య త‌న‌ను సర్‌ప్రైజ్ చేశాడ‌ని, తాను ఓకే చెప్పిన‌ట్టు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప్రేమ సంగ‌తుల్ని మెహ‌రీన్ ఆస‌క్తిక‌రంగా చెప్పుకొచ్చారు.  

వాళ్లిద్ద‌రి ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఇటీవ‌లే ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రుపుకున్నారు. త్వ‌ర‌లో పెళ్లి పీఠ‌లెక్క‌నున్నారు. ఈ నేపథ్యంలో భ‌వ్య‌తో క‌లిసి ఏకాంతంగా దిగిన ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. 

తామిద్ద‌రూ ఇలాగే క‌ల‌కాలం ఉండాల‌ని ఆశిస్తున్న‌ట్టు మెహ‌రీన్ చెప్పుకొచ్చారు. పెళ్లికి ముందే ఏకాంతంగా దిగిన ఫొటోలు కావ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. భ‌వ్య‌గాడితో మెహ‌రీన్ వీర‌ప్రేమ గాథ , విర‌హ ప్రేమ గాథ అనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.